ఓ ఓటరన్నా..! ఎక్కడ నీ వజ్రాయుధం..?
అవిగో అవిగో
వస్తున్నాయ్..!
వస్తున్నాయ్..!
మేకవన్య పులులు..!
తేనె పూసిన కత్తులు..!
ఏమి వస్తేనేమోయ్..?
ఎవరు వస్తేనేమోయ్..?
ఓ ఓటరన్నా..! నీకేటి భయం...
నీ ఆత్మసాక్షిగా...
అంబేద్కర్ అందించిన
నీ వజ్రాయుధాన్ని ధరించి...
నిర్భయంగా...నిష్పక్షపాతంగా...
నీళ్ళను పాలను వేరుచేసే హంసలా...
నీవు విజ్ఞతతో విచక్షణతో ఓటు వేసెయ్...
రేపు నీకు పగటి పూటే చుక్కలు చూపించే
అవినీతి నేతలకు నీవే చుక్కలు చూపించు



