Facebook Twitter
దైవనామ స్మరణ...

నిత్యం 

నీవు నిష్టాగరిష్టుడవై

నీ కర్మలను

ధర్మబద్ధంగా 

నిమానుసారంగా

నీతిగా నిజాయితీగా 

నిస్వార్థంగా

చిత్తశుద్ధితో

ఏకాగ్రతతో

మనసును

జ్వాజ్యల్యమానంగా

ప్రకాశించే

ఆ అఖండజ్యోతిపైనే

లగ్నం చేసి

అఖిలాండేశ్వరుడైన 

ఆ ఆది దేవుడు

ఆ దేవదేవుడు

ఆ శ్రీమన్నారాయణుడు

ఆ పరమశివుడు

ఆ శ్రీ క్రిష్ణుడు

ఆ శ్రీరామ చంద్రుడు

ఆ ఆర్తజన రక్షకుడు

ఆ ఆపద్బాంధవుడు

కొండకు చేరిన

భక్తులు కోరిన

కోటి కోరికలనైనా తీర్చేటి

కోనేటి రాయుడైన

శేషశైలా వాసుడైన

ఆ శ్రీ వెంకటేశ్వరుని

దివ్య దర్శనం కోసం

ఆ దివ్యనామాన్ని

మనసారా ఒక్కసారి స్మరిస్తే చాలు

నోరారా ఒక్కసారి పిలిస్తే చాలు

మదిలో ఒక్కక్షణం తలిస్తే చాలు

నీ జన్మ తరిస్తుంది, నీవు చేసిన

సమస్త పాపాలు తొలుగును గాక !

నీకు సకల శుభములు కలుగును గాక !

పడిన నీ కష్టములన్నీ తొలిగిపోవును గాక !

నీ జీవితం వెన్నెలమయమై వెలిగిపోవును గాక !