ఈ జీవిత సత్యం
నీకున్నది కాని
నీవు కొన్నది కాని
నీది అనుకున్నది కాని
ఏదీ నీది కాదు
నిన్ను కన్నవారు కాని
నీవు కట్టుకున్నవారు కాని
నీవు కన్నవారు కాని
ఎవరూ నీవారు కారు
ఎవరూ నీ వెంట రారు
ఔను ఇదినిజం పచ్చినిజం
అందుకే మరెందుకు
మీరు అనుభవించని ఆ లక్షలకోట్ల
మీద అంత ఆశ ఎందుకు?
నీకు దక్కని ఆ ఆస్తిపాస్తులు
ఆర్జించాలని అంత ఆరాటమెందుకు?
అనిఅంటుంది కదా మీ అంతరాత్మ
అట్టి అంతరాత్మ ప్రబోధం
శ్రద్ధగా వినండి,బుద్ధిగా ఆచరించండి
అప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని
తప్పక ప్రసాధిస్తాడా పరమాత్మ



