కళ్ళు పొరలు కమ్మి కామాంధులు
విచ్చలవిడిగా తిరుగుతున్ళారు..?
పిచ్చికుక్కల్లా రెచ్చిపోతున్నారు..?
మహిళలపై విరుచుకు పడుతున్నారు..? మానభంగాలు హత్యలు చేస్తున్నారు...?
నిజమే మరి ఎవరిది తప్పెవరిది..?
ఎవరు ఈ అకృత్యాలకు బాధ్యులెవరు..?
చట్టసభల్లో గట్టి శాసనాలు...
చేయని ప్రజాప్రతినిధులదా..?
లంచగొండి అధికారులదా..?
తక్షణమే కఠినమైన శిక్షలువేసి...
కోర్టులో కొరడాలు
ఝులిపించని న్యాయమూర్తులదా..?
మహిళలకు రక్షణనివ్వలేని రక్షణశాఖదా?
ధైర్యంగా న్యాయంగా విచారణ జరిపి
ధోషుల్ని నిర్థారించలేని నిఘాసంస్థలదా.?
ఎవరిది..?నిజానికి తప్పెవరిది..?
ఎవరు ఈ అకృత్యాలకు బాధ్యులెవరు..?
డ్రగ్స్ కు బానిసలైన
అబ్బాయిలను అదుపులో పెట్టని...
చుట్టూ విషసర్పాలేనని...
దారినిండా కామాంధులేనని...
అమ్మాయిలూ జరా జాగ్రత్తని
హెచ్చరికలు చేయని అమ్మానాన్నలదా..?
ఆత్మ రక్షణ ఆయుధాలు లేకుండా అప్రమత్తంగా ఉండే...చేతులు కాలాక
ఆకులు పట్టుకొనే అమ్మాయిలదా..?
ఎవరిది నిజానికి తప్పెవరిది..?
ఎవరు ఈ అకృత్యాలకు బాధ్యులెవరు..?
విజ్ఞతతో ఆలోచించమని అందరికి విజ్ఞప్తి



