Facebook Twitter
అంటారు...ఏమని..???

అంటారు...ఏమని..?
ఆడపిల్ల ఇంటికి వెన్నెల వెలుగని...
ఆమే మా ఇంటి మహాలక్ష్మియని...

అంటారు...ఏమని...?
నా శ్రీమతి నాకు ఆ భగవంతుడు
ఇచ్చిన ఓ బంగారు బహుమతియని...

అంటారు...ఏమని..?
ఆమె ఆకాశంలో సగమని...
అందరి ఆకలి తీర్చే అన్నపూర్ణయని...

అంటారు...ఏమని..? లేచింది
నిద్ర లేచింది మహిళా లోకమని...
దద్దరిల్లింది పురుష ప్రపంచమని...

అంటారు...ఏమని..? ఆడవారు
నేడు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని... అంతరిక్షంలో సైతం విహరిస్తున్నారని...

అంటారు...ఏమని..?
ఏరోజైతే ఒక స్త్రీ అర్థరాత్రివేళ స్వేచ్ఛగా
నిర్భయంగా వీధుల్లో పక్షిలా విహరించి...
ఏ మగమృగాల కోరలకు బలైపోకుండా
సురక్షితంగా ఇల్లు చేరుతుందో...
ఆరోజే ఈ స్త్రీ జాతికి...
నిజమైన స్వాతంత్ర్యమొచ్చినరోజని...