అత్యాచారం చేసిన తేది...
అతిక్రూరంగా హత్య చేసిన తేది...
ఆ కామాంధులను ఎన్ కౌంటర్ చేసి పిట్టల్ని కాల్చినట్టు కాల్చిన తేది...
ఒక్కటే కావాలి...
తప్పుచేసిన వారికి తక్షణమే శిక్షపడేలా
కొత్త చట్టాలు రావాలి...
అవి కామాంధులకు కనువిప్పు కావాలి...
ఔను నిందుతుల ఇల్లే ప్రజాకోర్టుగా...
తల్లిదండ్రులే న్యాయముర్తులుగా...
వారిచ్చిందే తుది తీర్పుగా...
కుటుంబ సభ్యులే...
కసిదీరా కక్ష తీర్చుకునేలా...
ఘోర నరకాన్ని అనుభవించి
అతి కిరాతకంగా...
అతి దారుణంగా...చంపబడిన
తమ బిడ్డల ఆత్మలు శాంతించేలా...
తక్షణమే...ఆ బిడ్డలు కన్నుమూసిన
మరుక్షణమే ఆ కామాంధులు
సైతం కన్ను మూయాలి...
ఆ తేదీలన్నీ చరిత్రలో ఒక్కటి కావాలి...
కొత్త చట్టాలు రావాలి...
అవి కామాంధులకు కనువిప్పు కావాలి...
మహిళల మానాన్ని నిలువునా
హరించిన మానవమృగాల "ప్రాణాలే"
ఆ "పాపానికి పరిహారం" కావాలి...
ఇదే ఇదే సామూహిక
మానభంగానికి బలైపోయిన
మహిళలు "మగమృగాలకు"
లిఖిస్తున్న "మరణ శాసనం"...



