Facebook Twitter
ఒద్దొద్దు ఉన్మాదులకు ఉరిశిక్ష..! కామాంధులకు కారాగార శిక్ష..!

అయ్యో అయ్యో మరో నిర్భయపై
సామూహిక హత్యాచారమా..?
ప్రాణాలు పోసే ఆసుపత్రిలో
ప్రాణాలు హరించడమా..?
నమ్మశక్యం కాకున్నదే...

అయ్యో..! అయ్యో..!
గట్టున పడ్డ చేపపిల్లలా...
తోడేళ్ళకు చిక్కిన మేకపిల్లలా
పులులకు చిక్కిన జింకపిల్లలా...
పంజరంలో చిక్కుకున్న పక్షిలా...
గ్రద్ద గోళ్ళకు చిక్కిన కోడిపిల్లలా...
వేటగాళ్ల వలలో చిక్కిన లేడిపిల్లలా...

ఎంతగా గిలగిలాడిందో...
కామాంధుల విషపుకోరల్లో చిక్కి
ఎంతగా విలవిలలాడిందో...
ఒళ్ళంతా గుల్లచేస్తే
ఎంతగా నరకాన్ని అనుభవించిందో...
విధివంచితురాలైన ఆ తల్లికే తెలుసు...

ఆమె నరకాన్ననుభవిస్తూ ఉంటే
స్వర్గ రుచులకోసం అర్రుచాసిన
ఓ నీచులారా నికృష్టులారా
చాటు మాటుగా కాటువేసే
ఓ సర్పసంతానమా...!
మీకు సజీవ సమాధి కట్టాలిరా..!

కళ్ళనుండి...
నోటి నుండి...
కటిభాగం నుండి...
రక్తం కారుతున్నా...
కాళ్లు చేతులు విరిచేసి
ఒంటినిండా గాయాలుచేసి
గొంతు నులిమేసి
నిర్జీవంగా కట్టెలా పడిఉన్న
ఆ తల్లి తనువునుండి రాక్షసులై
రక్తాన్ని జుర్రుకున్నారు కదరా...

నిస్సహాయురాలైన
అమాయకురాలైన
అభ్యుదయ భావాలున్న
ఆ స్త్రీ మూర్తిని...
ఆ ప్రాణదేవతను...
చిత్రహింసల గురిచేసి
కామంతో కళ్ళు పొరలుకమ్మి
రక్కిరక్కి రాక్షసానందం పొంది
పొట్టన పెట్టుకున్నారు కదరా...

ఓరి రాక్షసులారా..! రాబందులారా..!
మీరింత విషం పుచ్చుకొని
చావడం మేలు కదరా...
మీకన్నా వీధిలో కుక్కలే నయం కదరా...

ఓరి నీచులారా..! నికృష్టులారా..!
మిమ్మల్ని గండ్రగొడ్డళ్ళతో
ముక్కలు ముక్కలుగా నరికి
కుక్కలకు నక్కలకు కాకులకు
గద్ధలకు విసిరేసినా తప్పులేదు కదరా..!

మీకు విచారణలు...
కోర్టు కేసులెందుకురా...
మిమ్మల్ని నడిరోడ్డులో
ఉరికంబానికి
వ్రేలాడేదీసి ఉరితీసినా...
చెట్టుకు కట్టేసి చెప్పులతో కొట్టినా
కత్తులతో పొడిచినా
తుపాకులతో కాల్చినా ప్రజాకోర్టులో
ఎన్ కౌంటర్ చేసినా తప్పులేదురా..!

మీది మానవజన్మ కాదురా...
మీరు మగమృగాలురా...
మీది సంకరజాతిరా...
మీకు ఒక్క క్షణం కూడా
ఈ భూమిపై బ్రతికే హక్కులేదురా..

మీరు తక్షణమే చావాలిరా..
మీమ్మల్ని పిట్టల్ని
కాల్చినట్టు కాల్చి చంపాలిరా...
మీకు ఉరిశిక్ష సరిపోదురా..
మీరు చేసిన
ఈ నేరానికి...
ఈ ఘోరానికి...
ఈ దారుణానికి...
ఈ నీచకృత్యానికి......
మానవత్వనికే మచ్చ తెచ్చిన
మిమ్మల్నిమీ మగతనాన్ని
మంటల్లో కాల్చి మసి చేయాలీరా...