ఈ కామాంధుల
రాబందుల రాజ్యంలో
చట్టాలు రాక్షస
రాజకీయ నాయకుల
చుట్టాలౌతున్నాయి
వారి అండతోనే
ఈ అకృత్యాలు...
ఈ అఘాయిత్యాలు...
మహిళలపై ఈ మానభంగాలు...
కోర్టుకేసులెందుకు ఈ రాక్షసులకు..?
న్యాయవిచారణ ఎందుకు ఈ నీచులకు..?
పవిత్ర దేవాలయం లాంటి
ఆసుపత్రిలో సామూహిక
అత్యాచారానికి బలై...
అతి క్రూరంగా...
అతి కిరాతకంగా...
అతి భయంకరంగా...
అనేక చిత్రహింసలకు గురిచేసి
కళ్లకు నరకాన్ని చూపించి
మానభంగం చేసి ప్రాణదేవత
ప్రాణాలనే బలి తీసుకున్న
ఆ కీచకులకు...ఏశిక్ష విధించాలి..?
ప్రభుత్వాలు చట్టసభలే నిర్ణయించాలి...
బాధితుల తల్లిదండ్రులే న్యాయమూర్తులుగా...
వారి ఇల్లే ప్రజాకోర్టుగా...
వారిచ్చిందే తుదితీర్పుగా...
వారికి నచ్చిన శిక్ష విధించేలా...
ప్రజల సమక్షంలో ప్రజా కోర్టులో
బహిరంగంగా గరుడ పురాణంలోని శిక్షలన్ని ఏకకాలంలో అమలు చేసేలా
తక్షణమే కొత్త చట్టాలను చేయాలి....
సలసల కాగే నూనెలో వేసి
మలమల మాడిపోయేలా చేయాలి...
మగతనాన్ని మంటల్లో కాల్చివేయాలి...
ఇట్టి కామాంధుల్ని
ఒక్కసారి చంపరాదు
బాధితులు ఎంతగా నరకాన్ని అనుభవించారో అదే నరకాన్ని
వారనుభవిస్తూ...అనుభవిస్తూ...
చేసిన నేరానికి...నీచకృత్యానికి...
పశ్చాత్తాప పడుతూ...పడుతూ...
కుమిలిపోతూ...కుమిలిపోతూ...
కుక్కచావు చావాలి...
కారణం వారిది కుక్కజన్మ...గనుక...
