Facebook Twitter
మగతనమా..? మానవత్వమా..?

సిగ్గూలజ్జా  భయం...
పశ్చాత్తాపం...లేశమైన లేకండా
పశువాంఛతో రగిలిపోయే
ఈ కామాంధులకు ఇక భూమిపై
జీవించే హక్కు ఎక్కడిది..?
మరేం చేయాలి..?
మానవత్వం మరచిన...
బరితెగించిన ఈ మానవమృగాలను...?

"మగతనాన్ని"
చూసుకొని గర్విస్తున్నారో...
మత్తులో మునిగిపోతున్నారో...
విచ్చలవిడిగా తిరుగుతున్నారో...
విషసర్పాలై బుసలు కొడుతున్నారో...
వీరంగం చేస్తున్నారో విర్రవీగుతున్నారో...
పిచ్చికుక్కలై...రెచ్చిపోతున్నారో...
"మగతనాన్ని" రంపంతో కొయ్యాలి
ప్రపంచమంతా వీక్షిస్తుండగా
బహిరంగంగా వారిని ఉరితియ్యాలి..

అప్పుడే...ఈ కీచకుల క్రూరత్వానికి
బలిలైపోయిన ఆ అమాయకపు
ట్రైనీ డాక్టర్ మౌమిత ఆత్మకు శాంతి...
జీవశ్చవాల్లా...బాధితుల్లా బ్రతికి ఉన్న
కన్నవారికి కాసింత...ఉపశమనం...
కరుడుగట్టిన కామాంధులకు కనువిప్పు...