ఇది రాబందుల స్వైరవిహారం..!
ఇది మగమృగాల పైశాచికత్వం..!
వారికన్న పచ్చగడ్డి
మేసేటి ఆ పశువులే నయం!
ఆమె అబలకాదు సబలన్నారు..!
ఆమె ఆకాశంలో సగమన్నారు...!
ఆడదంటే ఆదిపరాశక్తి అన్నారు..!
స్రీ శక్తి స్వరూపిణి అన్నారు..!
కానీ రక్షణలేక ఆ స్త్రీ నేడు రక్తపు
మడుగులో నిర్జీవంగా పడివున్నదే..!
ఏం జరుగుతోంది
నా వేదభూమిలో..?
ఎటు పోతుందో నాదేశం..?
నా సంసృతి సంప్రదాయాలు
సమాధి అవుతున్నాయే...!
మనిషిలో మానవత్వం
మంట కలిసిపోతున్నదే..!
కామాంధులు రాబందులై రాజ్యమేలుతున్నారే..?
చట్టమంటే భయంలేక స్వేచ్ఛగా
విచ్చలవిడిగా తిరుగుతున్నారే..!
ఎప్పుడు స్త్రీలు అర్థరాత్రిలో
స్వేచ్ఛగా నిర్భయంగా తిరుగుతారో..!
అప్పుడే మనకు స్వాతంత్ర్యమన్న...
గాంధీజీ కన్న కలలు నెరవేరేదెన్నడు..?
కన్నతల్లి భరతమాత
కళ్ళముందు జరిగే ఈ కామాంధుల
వికృత క్రీడలకు అంతమెప్పుడు..?
పటిష్టమైన చట్టాలు
రూపొందించినప్పుడు...!
ఉన్మాదులైన
కామాంధులను ఉరితీసినప్పుడు...!



