Facebook Twitter
సృష్టికర్త ఒకరున్నారు ?కాదనే వారెవురున్నారు?

తాళి కట్టించుకున్న ప్రతిభార్య

వెనుక ఒక భర్త ఉన్నట్లు 

పుట్టిన ప్రతిబిడ్డ వెనుక ఒక తండ్రి 

చదివే ప్రతివిద్యార్ధి వెనుక ఒక గురువున్నాడు 

 

ఆడిన ప్రతిఆట 

వెనుక ఒక ట్రైనరున్నట్లు

పాడిన ప్రతిపాట వెనుక ఒక గాయకుడు

గెలిచిన ప్రతిజట్టు వెనుక ఒక నాయకుడున్నాడు

 

వ్రాసిన ప్రతికావ్యం 

వెనుక ఒక కవి ఉన్నట్లు

వేసిన ప్రతిబొమ్మ వెనుక ఒక ఆర్టిస్టున్నాడు 

 

పెరిగిన ప్రతిమొక్క 

వెనుక ఒక తోటమాలి ఉన్నట్లు 

పండిన ప్రతిపంట వెనుక ఒక రైతున్నాడు

 

కరోనాసోకి బ్రతికిన ప్రతిరోగి 

వెనుక ఒక డాక్టరున్నట్లు

గెలిచిన ప్రతికేసు వెనుక ఒక జడ్జివున్నాడు

 

32 ఎకరాల్లో 40 లక్షలఖర్చుతో 

1893లో నిర్మించిన అద్భుత కట్టడం 

ఆకాశ దర్పణం ఫలక్ నుమా ప్యాలెస్ 

వెనుక ఆరో నిజాం అలీఖాన్ మామ 

విఖారుల్ ఉమ్రా ఇక్బాల్ ఉద్ దౌలా ఉన్నట్లు

 

చూసేందుకు రెండుకళ్ళు చాలని

ఈ అనంతమైన,అద్భుతమైన

ఈ అఖండమైన,ఆశ్చర్యకరమైన

ఈ సుందరమైన,సువిశాలమైన సృష్టి 

వెనుక కనిపించని ఒక సృష్టికర్త ఉన్నాడు  

కాదనే వారెవురున్నారు?