Facebook Twitter
మగమృగాలు...?(2)

నాటి
నిస్సహాయురాలైన
నిర్భయలాంటి
ఓ అందమైన యువతి
కామాంధులై కళ్ళు
పొరలు కమ్మిన
మగమృగాల చేతికి
చిక్కిన ఆ క్షణం...!

ఆ ఒక్క క్షణం
అతి ప్రమాధకరం...
అతి భయంకరం....
ఆ విషఘడియను
తప్పించుకున్న చాలు
బ్రతుకు భద్రం...లేకున్న ఛిద్రం...

అది స్వాపరాధమా..?
అది లలాట లిఖితమా..?
అది పోలీసులు వైఫల్యమా..?
అది ఆ పరమాత్మకే ఎరుక....

అట్టి పోకిరిమూకల
ఆగడాలను అడ్డుకోలేని
అవినీతి అధికారులంతా
అంధులే...అసమర్థులే...
అందుకే విద్యార్థులు...
మహిళా సంఘాలు....
విప్లవ శంఖం పూరించాలి...

అమాయకపు అబలలకు
న్యాయం జరిగే వరకు...
మగమృగాలకు
మరణశిక్ష పడేవరకు...
సమిష్టిగా పోరాడాలి...
కొండంత అండగా ఉండాలి...