Facebook Twitter
కోల్కతా ఆర్జీకార్ మెడికల్ ఆసుపత్రిలో డా.మౌమిత ఆత్మ ఘోష..?

ఆసుపత్రే నా దేవాలయం
అందులో నేనొక వైద్యురాలిని
రోజు అనేక మంది రోగులకు
36 గంటలు వైద్యసేవలందిస్తూనే...
సమయం దొరికితే...
సామాజిక న్యాయం...
సెక్సువల్ వాయిలెన్స్ మీద
కౌన్సెలింగ్ ఇస్తూ...
అనేక సేమినార్లలో పాల్గొంటూ మహిళలెవరైనా మానభంగాలకు
యాసిడ్ దాడులకు గురై
మానసికంగా కృంగిపోతే
వారికి చక్కని సలహాలనిస్తూ...
ధైర్యంగా...అక్రమార్కులమీద
సామాజిక రుగ్మతల మీద పోరాడే
అభ్యుదయ భావాలుగల యువడాక్టర్ ని

"నరకం ఖాళీగా ఉంది" కారణం
"రాక్షసులందరు భూమి మీదే ఉన్నారు
"అందుకే "రేప్ చేయొద్దు" కాదు
"రేప్ చేయబడవద్దు" అన్నదే నా నినాదం

నా భావాలు గిట్టని నా శత్రువులంతా
నాపై కక్షగట్టి కసితో పగతో రగిలిపోతూ...
నాపై రెక్కీ నిర్వహించి
ఒక పక్కా ప్లాన్ ప్రకారం
నన్ను నిస్సహాయురాలను చేసి...
అర్థరాత్రి వేళ ఓ రాక్షసమూక
సీసీ కెమెరాలులేని కాన్ఫరెన్స్
హాల్ తలుపులు మూసేసి...
అరిచి గీపెట్టినా ఎవరికేమీ వినిపించని... అక్కడేమి
జరుగుతుందో ఎవరికేమీ కనిపించని...

నేను ఎంతగా ప్రతిఘటించినా
తప్పించుకోలేని విధంగా
నా చుట్టూ వలపన్ని అరిచి
గోల చేయకుండా ముందుగా
నా గొంతు నులిమేసి...
నన్ను మూగదాన్ని చేసి...
నా కాళ్ళు చేతులు విరిచేసి...
గోళ్ళతో పళ్ళతో నన్ను రక్కిరక్కి...
నా ఒంటి నిండా గాయాలు చేసి
రక్తం ఏరులై పారేల గోడకేసి కొట్టారు ...

"నన్ను పంజరంలో చిక్కిన పక్షిని" చేసి
"పులులను ఎదిరించలేని జింకను" చేసి
"తోడేళ్ళను ఎదురించలేని మేకను" చేసి
"ఏనుగుల్ని ఎదిరించలేని ఎలుకను" చేసి అతికిరాతకంగా...అతి నీచాతినీచంగా...
అతిదారుణంగా...నాపై విరుచుకుపడి...
భరించలేని...
ఎదిరించలేని...
తప్పించుకోలేని...
ఎవరికీ చెప్పుకోలేని...
దిక్కులేని దీనస్థితిలో పడేసి...నన్ను

పువ్వును నిలిపినట్టు నలిపేశారు...
చిత్రవధ చేశారు...పదేపదే
నా ఆడతనంతో ఆడుకొన్నారు...
రక్తపు మడుగులో పడి నేను
గిలగిల కొట్టుకుంటున్నా...
కాసింతైన దయాదాక్షిణ్యం లేకుండా
పిచ్చికుక్కల్లా రెచ్చిపోయారు....

యాక్సిడెంట్ జరిగి శరీరం నుజ్జునుజ్జు ఐనట్టు నా ఒళ్ళును గుల్లగుల్ల చేసి
రాబందులై అర్థనగ్నంగా పడివున్న
నా అవయవాలతో ఆడుకొన్నారు రాక్షసానందం పొందారు...నన్ను
కొన్ని గంటలు చిత్రహింసలకు గురి చేశారు...నాకు నరకాన్ని చూపించారు
అతికిరాతకంగా నా ప్రాణాలు తీశారు
సాక్ష్యాలన్నిటిని సమాధి చేశారు...
నా హత్యలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్
పోలీస్ కమిషనర్ డ్రగ్స్ మాఫియా కుట్ర దాగి ఉంది...ఇదే నా మరణ వాంగ్మూలం

ఓ అమ్మా నాన్నలారా న్యాయపోరటం
చేయండి నాలాగ రేపు మరో నిర్భయ బలికారాదు...ఆ కామాంధులను కాల్చి
చంపాలి ఆ ఉన్మాదులను ఉరితియ్యాలి...
ఇదే నా ఆత్మ సందేశం...
(ఇది కోల్కతా ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రి లో వినిపించే డా.మౌమిత ఆత్మ ఘోష...)

అయ్యో ఓ దైవమా...
ఇదేమి రాక్షసపాలన...స్రీ జాతికేది రక్షణ..?
న్యాయం సామాన్యులకందని ద్రాక్షేనా?
ఆ అడవి సింహాలను వేటాడే దెవరు..?
ఈ జింక పిల్లకు న్యాయం చేసేదెవరు..?