Facebook Twitter
ఒక విష గడియ..?(1)

నాటి
నిస్సహాయురాలైన
నిర్భయలాంటి
ఓ అందమైన యువతి
కామాంధుడైన
ఓ మగమృగం చేతికి
చిక్కిన ఆ క్షణం...!

గురిచూసి వేటగాడు
విసిరిన బాణానికి
ఓ బంగారుజింక...
బలైపోయినట్లే...!

ఓ చక్కని చిలక...
పంజరంలో చిక్కి
విలవిలలాడినట్లే...!

ఓ చేపపిల్ల...
చెరువు గట్టునపడి
గిలగిల కొట్టుకున్నట్లే...!

ఓ కప్పపిల్ల...
త్రాచుపాము విషపు
కోరలకు దొరికినట్లే...!

ఓ కోడిపిల్ల...
ఎగిరే గ్రద్ద కాళ్ళకు
చిక్కి ఉక్కిరిబిక్కిరైనట్లే...!

ఓ మేకపిల్ల...
కొండచిలువ
నోట్లో దూరినట్లే...!

ఓ ఏనుగుపిల్ల....
మొసలి నోటికి
చిక్కి హరిని స్మరిస్తూ
ఆర్తనాదం చేసినట్లే...!