తెలిసి తెలిసి...ఎందుకురా..?
ఎందుకురా తప్పులు చేస్తావు..?
ఎందుకురా నిప్పుల్లో దూకుతావు..?
అందరికీ చెబుతావు కదరా నీతులు
తప్పుడు పనులెప్పుడూ చెయ్యెరాదని
మరి నీబుద్ధి ఏగడ్డి తిన్నదిరా అడ్డగాడిద?
ఓరి నీచుడా...! నికృష్టుడా..!
ఓరి అంధుడా.! కామాంధుడా..!
ఇంత నీచమైన...
ఇంత ఘోరమైన...
ఇంత నికృష్టమైన...
ఇంత దారుణమైన...
ఇంత దుర్మార్గమైన...
ఇంత అసహ్యకరమైన...
ఇంత అమానవీయమైన...
ఇంత నమ్మశక్యం కాని
ఈ పాపిష్టి పని ఎలా చేశావురా..?
ఓరి నీచుడా...! నికృష్టుడా..!
ఓరి అంధుడా.! కామాంధుడా..!
అందరూ నిన్నేమంటున్నారో తెలుసారా..
ఛీఛీ...ఛీఛీ...కళ్ళు పొరలు కమ్మిన
వీడు మనిషి కాదు ఒక విషసర్పమని...
మానవరూపంలో ఉన్న ఒక మృగమని...
వీడొక గుంట నక్కని...గజ్జి కుక్కని...
వీడు సమాజానికి ఒక చీడపురుగని...
వీడొక పచ్చిగడ్డి మేసే పశువని...
వీడికి క్షణం కూడా ఈ భూమిపై
తిరిగే హక్కులేదని...శపిస్తున్నారురా...
వాన్ని చంపేయండి..!
వాన్ని ఉరితియ్యండి..!
వాడు నా కడుపున పుట్టలేదు..!
అంటూ...తన రక్తం పంచుకుని
పుట్టిన బిడ్డచావును ఏ తల్లి కోరుకోదు...
కానీ...నీ తల్లి కోరుకుందంటే నిజంగా
నీవు మనిషివి కాదు నరరూపరాక్షసుడివే
ఓరి నీచుడా...! నికృష్టుడా..!
ఓరి అంధుడా.! కామాంధుడా..!
ఎందుకురా...? ఎందుకురా...?
ఏం సుఖం పొందాలని...నెలల
బిడ్డను పొట్టన పెట్టుకున్నావురా..?
నిజానికి నీకు యావజ్జీవ కారాగార శిక్ష
వేసి జైలుకు పంపినప్పుడు కాదురా...
నిన్ను నడిరోడ్డులో ఉరితీసి...లేదా
కాల్చి ఎన్కౌంటర్ చేసి...
డైరెక్ట్ గా కాటికి...పంపినప్పుడేరా..!
ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆత్మశాంతి..!



