Facebook Twitter
నేనొక గులాబీ పువ్వును...?

నేనొక
గుభాళించే
గులాబీ పువ్వునే..!
నన్ను ప్రాణానికి
ప్రాణంగా ప్రేమిస్తే‌.‌..
వాన్ని దైవంగా భావించి
గుండెల్లో గుడి కట్టుకుంటాను

కానీ నన్ను
నమ్మించి నట్టేముంచితే...
వాడుకొని వాడుకొని వదిలేస్తే..‌.
సింహంలా వెంటాడి వేటాడి...
వాడి గుండెలు చీల్చేస్తాను
నా ముళ్ళే నాకు ఆయుధాలు..‌.