నీలిమేఘమా నీకు వందనం..!
ఒక మేఘం కురిస్తే...
ఒక నేల తడిస్తే...
ఒక రైతు విత్తనమేస్తే...
ఒక పచ్చని పంట పండితే...
ఎందరి ఆకలి కేకలు ఆగునో కదా...
ఎందరి తీరని క్షుద్బాధ తీరునో కదా....
ఎందరి ఆకలి మంటలు ఆరునో కదా...
అందుకే ఓ నీలిమేఘమా నీకు వందనం..!
నీకు జన్మనిచ్చిన...
ఆ సాగరమాతకు సాష్టాంగ నమస్కారం..!
నిన్ను కరిగించిన...
ఉరుములు మెరుపుల మధ్య
నిన్ను చిటపట చినుకులుగా మార్చిన...
నిన్నీభువికి చేర్చిన కరుణామయుడైన...
ఆ వాయుదేవునికి వందనం అభివందనం!



