Facebook Twitter
మెతుకు సంతకం

రాలని 

ఒక చినుకు 

చుక్కకోసం 

కటిక చీకట్లో

ఎన్నో కన్నీటి 

చుక్కలురాల్చి... 

రాలిన 

ఒక చినుకు

చుక్కకు 

లక్షల చెమట 

చుక్కలను జతచేసి... 

రేయింబవళ్ళు 

రెక్కలుముక్కల్ చేసి...

దుక్కి దున్ని ఎండిన 

బంజరు భూముల్లో 

పచ్చని పంటలు పండించే

కోట్లాదిమంది ఆకలిమంటలార్పే... 

బ్రతుకు 

భరోసా నిచ్చే...

మెతుకు సంతకం చేసే... 

అన్నదాతలందరికి వందనం..! 

అభివందనం..! పాదాభివందనం..!