రైతు కన్నీటి చుక్కలు
నేడు ఒక వ్యక్తి
అఖండ విజయాన్ని
సాధించాడంటే..?
...గతంలో ఎన్నో వేలసార్లు
...పోరాడి ఓడిపోయి ఉండాలి
నిన్నటి ఓ సాధారణ వ్యక్తి
నేడు గొప్ప మేధావి అంటే..?
...ఆ వ్యక్తి ఎన్నో వేల వేల
...పుస్తకాలను పఠించి ఉండాలి
...ఎంతో అపారమైన జ్ఞానాన్ని
...మేధస్సును ఆర్జించి ఉండాలి
ఒక వ్యక్తి అందమైన
సుందరమైన ఒక గొప్ప
శిల్పాన్ని చెక్కాడంటే..?
...ఆ వ్యక్తి శక్తి యుక్తి ఆసక్తి
...నైపుణ్యం అనంతమని అర్థం
ఒక రైతు పొలం నుండి
ధాన్యం ఇల్లు చేరిందంటే..?
...ఆరైతు ఎన్ని నిద్రలేని
...రాత్రులను గడిపాడో
...ఎన్ని కన్నీటి చుక్కల్ని కారు
...చీకటిలో రాల్చాడో ఎవరికెరుక
...ఆ రైతు కనురెప్పలకు తప్ప...



