అన్నదాతల ఆక్రందనలు
ఢిల్లీ పెద్దలతో
పోరుకు సిద్ధమైన
ఓ రైతు వీరుల్లారా..!
ఓ రైతు సోదరుల్లారా..!
వెనుకంజ వేయకండి..!
మీ సమస్యలన్నీ
పరిష్కారమయ్యేంతవరకు...
మీ న్యాయపరమైన
డిమాండ్లు నెరవేరేంతవరకు...
నిజానికి అదిగో...
ఆ అధికారులకే...
ఆ ప్రభుత్వపాలకులకే...
చెవులుంటే...మీ
ఆకలికేకలు విని - చలిస్తారు
హృదయముంటే...మీ
ఆక్రందనలు విని - ఆదరిస్తారు
చేతులుంటే...మీ
శ్రమలు చూసి - చేయూతనిస్తారు
కళ్ళుంటే మీ...
ఆకలిచావులు చూసి - కరిగిపోతారు
అందుకే...
ఓ రైతువీరుల్లారా..!
ఓ రైతు సోదరుల్లారా..!
ప్రశ్నిస్తేనే ప్రతిఫలమన్న...
ప్రతిఘటిస్తేనే ప్రగతన్న...
సంఘటిత శక్తే సకల
సమస్యలకు పరిష్కారమన్న...
ఉద్యమిస్తేనే ఉషోదయమన్న...
ఒక నగ్నసత్యాన్ని
తెలుసుకోండి నవ్వుతూ బ్రతకండి...



