అదిగో వస్తోంది అతిలోక సుందరి..?
అందాలు ఆరబోస్తూ
అత్యాశతో ఆ మాయలేడి
రాజ్యకాంక్షతో అలెగ్జాండర్
దండయాత్రలు చేసినట్టుగా....
సామ్రాజ్యాలన్నీ ఆక్రమించినట్టుగా...
చిలిపి చూపులతో...
చిలక పలుకులతో...
కులుకు నడకలతో ఆ కలికి...
ఆ వగలాడి...ఆ వయ్యారి...
వలపు వలలు...
విసిరి బలహీనమైన
హృదయాలను కొల్లగొట్టడం...
ఇళ్ళను గుల్ల గుల్ల చేయడం...
మాయచేయడం మత్తెక్కించడం...
పచ్చని కాపురాల్లో చిచ్చు రేపడం...
అందరి కాళ్ళకు బంధాలు వేయడం...
అమాయకుల జేబులు ఖాళీచేయడం...
దాని దినచర్య అదిగో అదిగో వస్తోంది...
అతిలోక సుందరి జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త...



