Facebook Twitter
అంగడి బొమ్మ..!

అందాలు ఆరబోసే
ఓ సుందరీ గుర్తుంచుకో ...
అందమైన నీ తనువు
"చక్కని అద్దమే"...
ప్రతిబింబం చూసుకొన
"ప్రతిఒక్కరు సిద్దమే"...

నేడు బాహుబంధాలలో
బంధించుకుంటారు రేపు
నిన్ను "బహుదూరం" నెట్టేస్తారు
నేడు నీచుట్టూ తిరిగే ఈమగవారే...
రేపు నీ మీద వాలేటి ఈగలౌతారు...

రేపు "పెనురోగం"
పట్టి పీడిస్తుంటే...
"అనురాగం" చూపి
నిన్ను ఆదరించేదెవరు..?

ఓ మగువా గుర్తుంచుకో..!
వీరు నిన్ను ఆదరించడం కల్ల..!
రేపు సర్వనాశనం నీబ్రతుకు వీరివల్ల..!

అందుకే అందాలతో విందుచేయాలని
విచ్చలవిడిగా విలాసవంతమైన జీవితాన్ని
ఆశించే ఓ అందాల సుందరి...ఈ అందం అశాశ్వతమన్న....ఒక్కనిజం తెలుసుకో!

శీలాన్ని అమ్ముకోకు కాలాన్ని నమ్ముకో...!
పద్దతి మార్చుకో జీవితాన్ని సరిదిద్దుకో..!
బలహీనతలకు బలికాకు బ్రతుకుమార్చుకో!
కోరికల్ని చంపుకో కష్టపడి కడుపు నింపుకో !