Facebook Twitter
కన్న కూతురా కాదు...కాలనాగు..?

అయ్యో...అయ్యో 

ఇదేమి దారుణం..? 

ఇదెంతటి ఘోరం..? ప్రేమపిచ్చి పట్టి 

కళ్ళుపొరలు కమ్మి...కామదాహంతో

నచ్చిన ముగ్గురు ప్రియులతో 

విశృంఖల శృంగారంలో 

మునిగితేలే కన్న కూతురిని 

తాను వెళ్ళేదారి ముళ్ళదారని...

ఆ ముగ్గురు పచ్చి మోసగాళ్ళని...

వారు పగబట్టిన విషసర్పాలని...

వారితో పడక...నడక...స్నేహం...

తగదని హెచ్చరించిన...తండ్రినే 

తన స్వేచ్ఛకు అడ్డొస్తున్నాడని...

అప్పడాల కర్రతో కొట్టి చంపిందే... 

కనికరంలేని ఆ కన్న కూతురు...అయ్యో

ఆమె కన్న కూతురా కాదు కాలనాగు 

కష్టపడి లక్షలు ఆర్జించి... 

పెళ్లికోసం బ్యాంకులో దాస్తే...

చనిపోయిన భార్య బంగారునగలన్నీ

కూతురి పెళ్ళికోసం బీరువాలో దాచి ఉంచితే... ప్రేమపిచ్చి పట్టి అన్నిటినీ 

తన ముగ్గురుప్రియులకు దానం చేసి

కాదన్న తన కన్నతండ్రినే కడతేర్చిందే...

ఔరా ఇదేనా ప్రేమంటే... 

ఇది ప్రేమ కాదు ఇది మోహం... 

కళ్ళు పొరలు కమ్మిన కామదాహం...

ఆమె కన్నా కూతురా కాదు కామపిశాచి

వయసొచ్చిన కూతుర్ని

మంచి సంబంధం చూసి...

కొత్త పెళ్లి కూతురు చేసి.... 

అత్తారింటికి పంపాలని...

కమ్మని కలలేన్నో కనే 

కన్నతండ్రినే కాటికి పంపిందే...

అయ్యో...అయ్యే

ఇదేమి దారుణం..?ఇదెంతటి ఘోరం..? 

ఆమె కన్నకూతురా కాదు కన్నకూతురు

ముసుగులో పొంచిఉన్న ఒక మృత్యువు  

ఇప్పుడామె జీవితం 

అంధకారం గాఢాంధకారం 

ముందు నువ్వు వెనుక గొయ్యి 

ముందు జీవితమంతా ముళ్ళబాటే 

బతుకంతా అవమానాలే ఆరని కన్నీళ్లే...