Facebook Twitter
పొద్దు వాలిపోతోంది… పండు రాలిపోతోంది…

పండు రాలిపోతోంది
...పండి చెట్టు నుండి
పువ్వు వాడిపోతుంది
...ఎండి మొక్క నుండి

ఎగిరిపోతున్నాయి
...ఎండుటాకులు
కూలిపోతున్నాయి
...ఆశలసౌధాలు
కృంగిపోతున్నాయి
...ప్రేమపునాదులు

కమ్ముకొస్తోంది
........చిమ్మచీకటి
వినిపిస్తున్నాయి
.....విషాదగీతాలు
కలిసిపోతున్నాయి
...గాలిలో నిన్నటి
తీపిజ్ఞాపకాలు ఎన్నో ఎన్నెన్నో 

తెగిపోతున్నాయి
...భవబంధాలు
విడిపోతున్నాయి
...అనుబంధాలు
సమాధి అవుతున్నాయి
...రాత్రికిరాత్రే
రక్తసంబంధాలు ఎన్నో ఎన్నెన్నో 

పక్కున నవ్వుతున్నాయి
...పూలమొక్కలన్నీ
ఔను జీవితమంటే
...పగిలే నీటి బుడగేనని
ఎండే ఆకేనని
...జారే నీటిబిందువేనని
పండే కాయేనని
...నేలరాలక తప్పదని
దుమ్ములో ధూళిలో
...కలిసిపోక తప్పదని

వెక్కీవెక్కీ ఏడుస్తున్నాయి
ఆశతో ఆర్జించిన...ఆస్తులన్నీ
తమను వెంటతీసుకు పొమ్మని
కన్నీరు మున్నీరౌతుంది...కారు
తన యజమాని పార్థివదేహాన్ని
కాటివరకైనా మోసుకుపోతానని

భవబంధాలన్నవి "కన్ను మూసేవరకే"
బంధువులందరి "పయనం కాటివరకే"
కరుణ దయలేని కంటికి కనిపించని
ఓసీ! కరోనా రాక్షసీ !ఎంతపని చేశావే!