Facebook Twitter
ఆడపిల్లలు...ఆత్మహత్యలు…

ఓరి నీచుడా ! నికృష్టుడా ! అంధుడా ! కామాంధుడా‌ !మనిషివా‌ ! మానవమృగానివా !
నీకన్న పశువే నయం!

నీవు తాతవు ముసలి కుక్కవి
నక్కలా లిఫ్ట్ దగ్గర
ఎందుకురానక్కినక్కి తిరిగేవు...
పాపకోసం?
కొల్లేటి కొంగ చెరువుగట్టున వెతికినట్టు...
చేపకోసం...!

ఎందుకురా పాపం బంగారుతల్లిని
నీ వెకిలిచేష్టలతో బలితీసుకున్నావ్ ?
కుటుంబాన్ని బలిపశువును చేశావ్ ?

నీవు చేసిన ఘోరానికినీవు చేసిన
అకృత్యానికి
ఎంతటి మాసిన వేదనకు చిత్రహింసకు వ్యధకు బాధకు గురైందో ఎంతగా కుమిలిపోయిందో
కృంగిపోయిందో ఏమో

ఐదంతస్తులపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నదే...
అవమానంతో ప్రాణాలు తీసుకున్నదే...ఎదురు తిరగలేక
ఒక చల్లనితల్లి  రక్తపుమడుగులోపడి గిలగిలాడిందే...
చింతలులేని కుటుంబం విషాదంతో విలవిలలాడిందే...
చెప్పరా నీచుడా‌ ! నీకు శిక్ష విధించాలి ?

భూమిపై నీలాంటి దుష్టులు...దుర్మార్గులు
రాక్షసులు... రాబందులు... బ్రతకరాదు... నీవంటి
పెద్దలు...గ్రద్దలై బుసలుకొట్టే...విషసర్పాలై తిరగరాదు
చెప్పరా కీచకుడా ! నీకు శిక్ష విధించాలి ?

చెప్పులతో దేహశుద్ధి చేసి గాడిదలమీద ఊరేగించి
నిర్దాక్షిణ్యంగా నడిరోడ్డులో ఎన్కౌంటర్ చేయాలి !
సజీవ సమాధిచేయాలి పాతాళంలో పాతిపెట్టాలి !
అప్పుడే అమాయకపు ఆడపిల్లల ఆత్మకుశాంతి !

కానీ, మగమృగాలమీద నిత్యం నిఘా పెట్టని
తల్లీదండ్రులారా ! మీరు జాగ్రత్త మీ పిల్లలు జాగ్రత్త !!