Facebook Twitter
భయమెరుగని భరతఖండం ...

సమతా మమతను

బోధిస్తున్నవి మా వేదాలు

పుట్టిన ప్రతిజీవి గిట్టక తప్పదని

ఘోషిస్తున్నవి మా మతగ్రంధాలు

ఐనా నిత్యం యమధర్మరాజుతో 

యుద్దం చేస్తున్నవి మా వైద్య బృందాలు

వందల వేల ప్రయోగశాలల్లో నిద్రాహారాలు మాని

మందు కనిపెట్టడానికి,నీకు బొందపెట్టడాని

సంసిద్దంగా వున్నారు మా సైంటిస్ట్ లు

నీవు చేసే కనిపించని గాయాలపై

చల్లని మందును చల్లేందుకు

తమ కలాలతో గళాలతో సిద్ధంగా చేస్తున్నారు

మా గాయనీగాయకులు,మా కవిశేఖరులు

శతృవులూ మనమిత్రులేనన్నాడు మా రామయ్య

దుష్టశిక్షణ శిష్టరక్షణ తప్పదన్నాడు మా కృష్ణయ్య

స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి

అహింస సత్యం ధర్మమే మంచి మార్గమన్నారు

మా అల్లా క్రీస్తులు,గౌతమ్ బుద్ధుడు,మాగాంధీతాతలు

కాని,యుద్దమే శరణ్యమన్నాడు

ప్రక్కలోబల్లేలైన పాక్ చైనాల పై

పగతీర్చుకోమన్నాడు మా సుభాష్ చంద్రబోస్

అతిథులను సాదరంగా ఆహ్వానించి

ఆదరించి ఆలింగనం చేసుకోమన్నాడు

మా ప్రాణదాత, మా ప్రధాని మోడి

భిన్నత్వంలో ఏకత్వం మా జీవనవిధానం

నిన్ను,కనిపిస్తే ఖతంచేయడమే మాసిద్దాంతం

కానీ,మూడు నిమిషాలకొక శవాన్ని మ్రింగేస్తున్న

అణుబాంబులున్న అగ్రరాజ్యాలనే

అల్లకల్లోలం చేస్తున్న,అతలాకుతలం చేస్తున్న

ప్రజలు పీకలు నిర్దాక్షిణ్యంగా నులిమేస్తున్న

మాయదారి కరోనా మహమ్మారిని 

అణుబాంబులు వేసి అంతం చేయాలని

ప్రపంచదేశాలన్నీ ప్రతిజ్ఞ చేస్తున్నాయి

ఐనా,ఓసీ కరోనా రాక్షసీ నీ విషపు కోరలు చూసి

భయపడకున్నది ఒక్క మా భరత ఖండమే

ఇండియాకొస్తే నీకు దినదిన గండమే...