సూర్యునికంటే ముందు లేచినవారే
సుఖంగా ఆరోగ్యంగా జీవిస్తారని,
పుష్టికరమైన ఆహారం తీసుకున్నవారే
షష్టిపూర్తి చేసుకుంటారని,
డైనింగ్ టేబుల్ మీదున్న
ఘుమఘుమలాడే రుచికరమైన
ఆ వంటకాలన్నీ దీవిస్తున్నాయి ... ఏమని?...
ఇన్ని రోజులు ఉద్యోగరీత్యా
ఉరుకులు పరుగులు తీసిన వారిని
పనిభారంతో ఊపిరాడకున్న వారిని
జీవితంలో తిరిగిదొరకని,ఈ చక్కని
సమయాన్ని సద్వినియోగం చేసుకొమ్మని
కన్నబిడ్డలను ఎత్తుకొమ్మని
గట్టిగా గుండెలకు హత్తుకొమ్మని
కట్టుకున్న భార్యతో ప్రక్కనే కూర్చుని
మనసు విప్పి మాట్లాడుకోమని,
కాలం విలువ తెలుసుకొమ్మని,
కళ్ళు తెరవగానే,కనిపించే
ఆ క్యాలెండర్ దీవిస్తోంది... ఏమని?...
జీవితంలో ఎదురయ్యే ఎన్నో
చిక్కుముడులను విప్పుకుంటూ,
పిల్లల బంగారు భవిష్యత్తుకై బాటలు వేసే,
ఇంటికవసరమైన ఇన్సూరెన్స్,ఇన్వెస్ట్మెంట్లపై
పక్కా ప్రణాళిలు రచించుకోమని,
బ్యాంకు లాకర్లలో,వృధాగా పడివున్న
ఆ ధనం దీవిస్తోంది... ఏమని?.....
ఈ కష్టాలు కన్నీళ్లు కలకాలముండవని
భయపడవద్దని, భయబ్రాంతులకు గురికావద్దని
కారుమబ్బులు కరిగే, చిమ్మచీకట్లో తొలిగే
మంచిరోజులు ముందున్నాయని
కనిపించని ఈ కాళరక్కసి కరోనా
మన చేతులకు చిక్కుతుందని
మనందరి కాళ్ళకు మ్రొక్కుతుందని....



