ప్రేమంటే..?జీవితమంటే..?
ప్రేమంటే...
ఒక తీరని దాహం..!
అందుకే...వివాహం.
ప్రేమంటే..?
కనిపించని
ఒక మైకం..!
అందుకే...ఇద్దరు
ఏకం...మమేకం.
ప్రేమంటే..?
ఒక నమ్మకం..!
అందుకే ఈ
ఆత్మల అమ్మకం.
అమర ప్రేమ
విఫలమైన వేళ..?
"భగ్న ప్రేమికులు
"అమృతం ఇచ్చినా
"పుచ్చుకోరు
"విషం తప్ప అందుకే
ప్రేమంటే..? ఒక త్యాగం..!
జీవితమంటే..?
ఒక మధుపాత్ర..!
జీవితం అంటే..?
ఒక విహారయాత్ర..!
జీవితమంటే..?
జన్మజన్మల బంధం..!
జీవితమంటే..?
ఒక మకరందం..!
జీవితం అంటే..?
ఒక గజిబిజి రాతల జాతకం..!
జీవితమంటే..? ఒక జగన్నాటకం..!



