Facebook Twitter
ఒక చక్కని సమయం చిక్కితే బావుండు

ఆరోగ్యమే మహాభాగ్యమని తెలిసినా, సూర్యునికంటే ముందు లేస్తే సుఖపడతామని తెలిసినా, పుష్టికరమైన ఆహారం తీసుకుంటే షష్టిపూర్తి చేసుకుంటామని తెలిసినా,పని ఒత్తిడిలో వుండి, చేయలేకపోయిన

ఆ వాకింగ్, జాగింగ్, వ్యాయామం

యోగాలన్ని ఇంటివద్దనే వుంటూ చక్కగా చేసుకునే,

ఇంతటి బంగారమంటి అవకాశాన్ని

అందించినందుక నేనెవరిని అభినందించాలి?

కంటికి కనిపించని ఆ కరోనానా కాదు కాదూ...

 

నిద్రలేచింది మొదలు,తిరిగి రాత్రి పడుకునే వరకు 

ఓ యంత్రంలా బండచాకిరి చేసే నా భార్యకు ఇంటి పనుల్లో వంటపనుల్లో చేదోడు వాదోడుగా వుండేందుకు

ఇంతటి చక్కని సమయం చిక్కినందుకు

నేనెవరికి మొక్కాలి? 

కంటికి కనిపించని ఆ కరోనాకా కాదు కాదూ...

 

ఉదయం లేచింది మొదలు ఉరుకులపరుగుల ఉద్యోగంలో

ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యే పనిభారంతో క్షణం తీరికలేని తనకు,తన భార్యా పిల్లలతో, ఆడుతూ పాడుతూ, కలిసివుంటూ,కబుర్లు చెప్పుకుంటూ, కోరిన తిండి కడుపునిండా తింటూ, కంటినిండా కునుకుతీస్తూ,కమ్మని కలలుకనే,ఇంతటి బంగారమంటి అవకాశాన్ని అందించినందుకు నేనెవరిని అభినందించాలి?

కంటికి కనిపించని ఆ కరోనానా కాదు కాదూ...

 

ఎప్పుడూ ఎడమొహం పెడమొహంగా వుంటూ, వుండేది

ఇంట్లో నైనా వేరువేరుగదుల్లోవుంటూ, పడకునే పడక ఒకటేఐనా ఒకరిటు ఒకరటూ వుండే కాపురాల్లో,

కారుచిచ్చు రగిలిన కాపురాల్లో, విడాకులకు సిద్దమైన భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకోవడానికి, ముఖాముఖిచర్చలే మనస్పర్థలకు మందులని,కలసివుంటే కలదు సుఖమని తెలుసుకునే, ఇంతటి చక్కని సమయం చిక్కినందుకు,వారెవరికి పాదాభివందనం చేయాలి?

కంటికి కనిపించని ఆ కరోనా కాదు కాదూ...

 

మన ఆథ్యాత్మిక గ్రంథాలైన రామాయణ, మహాభారత భాగవత,బైబిల్, భగవద్గీతలను పారాయణం చేయు 

ఇంతటి బంగారమంటి అవకాశాన్ని 

అందించినందుక నేనెవరిని అభినందించాలి?

కంటికి కనిపించని ఆ కరోనానా కాదు కాదూ...

 

మరెవరిని? కరోనాను కట్టడి చేయడానికి, కనిపిస్తే దాన్ని ఖతం చెయ్యడానికి, కంకణం కట్టుకున్న,లాక్ డౌన్ ప్రకటించి కఠినమైన చర్యలు చేపట్టిన,మన జాతినేతలందరికి ముక్తకంఠంతో మనందరం, 

జయహో జయహో అంటూ జేజేలు పలకాలి.... జైహింద్.

 

(లక్షల కోట్లు లాసైనా లాక్ డౌన్ ప్రకటించి మనకు ప్రాణబిక్ష పెట్టిన ప్రధానమంత్రి కి మంత్రి మండలికి కృతజ్ఞతలతో)