Facebook Twitter
ఆటలు ఆడుకుందామా! పాటలు పాడుకుందామా!

నింగిలో చుక్కలను కోసుకొద్దామా !

నేలపై మొక్కలుగ నాటుకొందామా!

హరివిల్లునే మనం మోసుకొద్దామా!

అందులోరంగులనురాసుకుందామా!

 

వినువీధిలో విహంగాలమై విహరిద్దామా!

స్వేచ్ఛే మనిషికి ముఖ్యమని చాటుదామా!

ఎండల్లో వానల్లో కొండల్లో కోనల్లో తిరుగుదామా!

పకృతిఅందాలను తిలకించి పులకించిపోదామా!

 

ఎత్తైన పచ్చని చెట్లను ఎక్కుదామా!

కొమ్మల్లో కోతులమై ఆడుకుందామా!

తియతియ్యని మావిచిగుళ్ళు తిందామా!

కూహుకహూఅని కోయిలలమై పాడుకుందామా!

 

దేవుని గుడికి‌ వెళ్లి భక్తితో పూజలు చేద్దామా! 

బడికి వెళ్ళి చక్కగా పాఠాలు ‌నేర్చుకుందామా!

గురుదేవుళ్ళ పాదాలకు పాలాభిషేకం చేద్దామా!

అమ్మానాన్నల చల్లని‌ఆశిస్సులు అందుకుందామా!

 

త్రివర్ణపతాకాలు చేబూని వీధుల్లో తిరుగుదామా!

వందేమాతరం జాతీయ గీతాలను ఆలపిద్ధామా !

జై తెలుగుతల్లి జై భారతమాతంటు నినదిద్దామా!

మనదంతా ఒకేజాతియని విశ్వానికి వినిపిద్దామా!