జయహో ! జయహో ! ఓ జనదీపిక !
కమ్మని వార్తల పాఠకదేవుళ్ళ కరదీపిక !
జనజాగృతే తన ఊపిరన్న జనదీపిక !
జయహో ! జయహో ! ఓ జనదీపిక !
సంచలన పత్రిక మన జనదీపిక !
కవుల కలలను పండించే జ్ఞానదీపిక !
ప్రజల పక్షాన నిలిచే ప్రాణదీపిక !
జయహో ! జయహో ! ఓ జనదీపిక !
ప్రజాసంక్షేమమే పరమావధన్న ప్రజాదీపిక !
ప్రజలకు ప్రభుత్వానికి వారధి మన జనదీపిక !
తెలుగుజాతికి తెలుగుబాషకు
అంకితమన్నది ఈ త్యాగదీపిక !
జయహో ! జయహో ! ఓ జనదీపిక !
సహృదయ సంపాదక శిఖామణి
శ్రీ సున్నపు చిన్నారావుగారి మానస పుత్రిక !
పక్షపాతమెరుగనీ స్వచ్ఛమైన నిఖార్సైన
నిప్పుకణికలవంటి నిజాలే వార్తలై వరదలై గంగా
గోదావరిలా గలగలమని ప్రవహించే జలదీపిక !
జయహో ! జయహో ! ఓ జనదీపిక !
లక్షలాది పాఠక దేవుళ్ళ
మనసులను గెలిచిన మన జనదీపిక !
పచ్చని చెట్టై దినదినాభివృద్ధి చెందును గాక !
ఎవరెస్టు శిఖరమంత ఎత్తుకు ఎదుగును గాక !
ధృవతారై వార్తలవెలుగుల్ని విరజిమ్మును గాక!
రంగుల పత్రికారంగంలో రారాజై నిలచును గాక !
కవుల గుండెగుడిలో
ఒక దివ్వెగా వెలిపోవును గాక !
పాఠకుల హృదయాలలో ఒక
తీపిజ్ఞాపకమై మిగిలిపోవును గాక !
జయహో ! జయహో ! జనదీపిక !
అంటూ ప్రతిఉషోదయం సుమధుర
సుప్రభాతగీతమై వీనులకు విందుచేయును గాక !
అంటూ మనసారా కోరుకుంటూ...
సంపాదకులకు పత్రికాయాజమాన్యానికి
5 వ వార్షికోత్సవ శుభాకాంక్షలందజేస్తూ...
5 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు



