Facebook Twitter
తెలుగువాడినని గర్వించు

"తెలుగు వాడినని గర్వించు... 

తెలుగులోనే సంభాషించు...  

తెలుగువాడిగా జీవించు"...

 

"నభూతో న భవిష్యత్" 

అన్న రీతిలో అద్భుతంగా  

తెలుగువెలుగును... దేశ విదేశాలకు... 

 

తెలుగుజాతి ఖ్యాతిని... 

తెలుగుతల్లి కీర్తిప్రతిష్టలను

ఖండఖండాంతరాలకు విస్తరింపజేయాలి.. 

 

తెలుగుబాషను... 

ఒక సజీవనదిలా ప్రవహింపజేయ

నిర్విరామంగా నిస్వార్థంగా కృషి చేయాలి

 

తెలుగు భాషా వికాసానికై‌ పటిష్టమైన

ప్రణాళికతో అమూల్యమైన సేవలందించాలి