తక్షణమే అన్నీ సర్దుకొమ్మని
పరలోకం రమ్మని,ఆ పరమాత్మ నుండి
తియ్యని పిలుపు వస్తే, అది నీకు కరోనా వినిపిస్తే
కన్నులు మూయమని
కదలని కట్టెగా మారమని,ఆ పరమాత్మ నుండి
తియ్యని పిలుపు వస్తే, అది నీకు కరోనా వినిపిస్తే
ఉన్న,కన్న, కట్టుకున్న
బందాలన్నీ అనుబంధాలన్ని
తక్షణమే తెంచుకోమని,ఆ పరమాత్మ నుండి
తియ్యని పిలుపు వస్తే,అది నీకు కరోనా వినిపిస్తే
ఆత్మనే అద్దెగా చెల్లించమని
తక్షణమే ఈ భూలోకాన్ని ఖాళీచేయమని,
ఆ పరమాత్మ నుండి
తియ్యని పిలుపు వస్తే, అది నీకు కరోనా వినిపిస్తే
అరక్షణమైనా ఆలోచించగలమా ?
ఆలస్యం చేయగలమా,నో అని చెప్పగలమా?
ఒక్కక్షణమైనా వాయిదావేయగలమా?
మరణించక మౌనంగా వుండగలమా?
ఆరిపోతున్న దీపాన్ని
పారిపోతున్న ప్రాణాన్ని పట్టుకోగలమా?
ముద్దుపెట్టుకోకుండా
ముందున్న ఆ కరోనా మృత్యువును ఆపగలమా?
లేదే అంతటి శక్తి మనిషికే వుంటే
మరణాన్ని శాసించేవాడే?
మానవుడే మాధవుడైపోడే ?
దాగివున్న ఆ దైవాన్ని ధిక్కరించేడే ?
లేదు లేదు అది నిజం కాదు
మనిషే పాత్రధారి,సృష్టికర్తే సూత్రధారి...



