Facebook Twitter
కుటుంబసభ్యులకు వందనాలు,.

తమ,తమ కుటుంబసభ్యుల

ప్రాణాలను ఫణంగా పెట్టి

మండే ఎర్రని ఎండల్లో మాడిపోతూ

ఉద్యోగమే ఊపిరిగా డ్యూటీ చేస్తున్న 

మన పోలీసన్నలకు, వందనాలు 

శతకోటి వందనాలు,పాదాభివందనాలు

 

తమ,తమ కుటుంబసభ్యుల

ప్రాణాలను ఫణంగా పెట్టి

రాత్రింబవళ్ళు నిస్వార్థంగా

శక్తి వంచన లేకుండా

కంటిమీద కునుకు లేకుండా

కరోనా రోగులకు సేవలందిస్తున్న

డాక్టర్లకు నర్సులందరికి, వందనాలు

శతకోటి వందనాలు, పాదాభివందనాలు

 

తమ,తమకుటుంబసభ్యుల 

ప్రాణాలను ఫణంగా పెట్టి,వీధుల్లో

పేరుకు పోయిన దుర్గంధభరితమైన

చెత్తచెదారాన్ని ఎత్తివేసే

పారిశుద్ధ్య కార్మికులందరికీ, వందనాలు 

శతకోటి వందనాలు,పాదాభివందనాలు

 

ఇందరినీ చిరునవ్వులు చిందిస్తూ

డ్యూటీకి పంపించి, చీకటిపడే వరకు

క్షణక్షణం భయంతో ఎంతో దిగులుతో

వారు క్షేమంగా ఇంటికి తిరిగిరావాలని

కళ్ళలో వొత్తులు వేసుకొని

ఆశతో,ఎదురుచూసే, నిదుర కాసే

కుటుంబ సభ్యులందరికీ, వందనాలు 

శతకోటి వందనాలు,పాదాభివందనాలు

 

ఐతే,ఇంటిపట్టునే వుంటున్న, 

కోరినవి తింటున్న,కుంభకర్ణుల్లా

గురకలు పెట్టి నిదురపోతున్న 

మనందరిడ్యూటీ.......

వారు వారి కుటుంబ సభ్యులు

చల్లంగా వుండాలని

ముక్కోటి దేవతలకు మ్రొక్కడం

కరాళ నృత్యం చేసే ఆ కరోనా రాక్షసి 

కనిపిస్తే దాన్ని,అథఃపాతాళానికి త్రొక్కడం