అమరజీవి
పొట్టి శ్రీరాములు గారంటే
నిరాహార దీక్షకు నిలువెత్తు సాక్ష్యం
నిరాహార దీక్ష అంటే
నీకు నీవే విధించుకునే
ఒక క్రూరమైన సిలువ శిక్ష
నీకు నీవే మనస్ఫూర్తిగా
మృత్యువును ముద్దు పెట్టుకోవడమే
కౌగిలించుకోవడమే కన్నుమూయడమే
గతంలో నిరాహార దీక్షలతో
కార్మిక కర్షక నాయకులెందరూ
కన్నుమూశారు కనుమరుగయ్యారు కాలగర్భంలో కలిసిపోయారు
సమస్యల పరిష్కారానికి
అదొక్కటే చక్కని మార్గమని ఆయుధమని ఒక సాధనమని
జాతిపిత మహాత్మా గాంధీ గతంలో
ఆమరణనిరాహార దీక్షను చేపట్టారు న్యాయమైన డిమాండ్లు సాధించుకున్నారు
ఐతే ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం
అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చేసిన
58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష
భారతదేశంలోనే నాడు
ఒక సంచలనం...
ఒక ప్రభంజనం...
ఆంధ్రులు ఆరంభశూరులని
పొట్టి శ్రీరాములు వెంటెవరూ లేరని ఉద్యమానికి మద్దతునిచ్చే సానుభూతిపరుల
అంతుచూస్తానని
ఆంధ్రరాష్ట్ర ఉద్యమాన్ని ఉక్కుపాదంతో
అణచి వేస్తానని తప్పుడు రిపోర్టులను ప్రధానమంత్రి నెహ్రూకు పంపి
ప్రత్యేక రాష్ట్రం కోసం
తెలుగువారి ఆత్మగౌరవం కోసం
58 రోజులు నిరాహార దీక్ష చేసిన
పాపం పొట్టి శ్రీరాములుగారిని
పొట్టన పెట్టుకుంది రాజాజీ అహంకారం
వారి మరణం తెలుగుజాతి యావత్తు సిగ్గుతో తలదించుకునే ఒక విషాదం
వారి మరణయాతన మరువరానిది
ఏ శత్రువుకైనా రాకూడనిది
లాల్ బహదూర్ శాస్త్రిగారిలా
పొట్టివారంతా గట్టివారంటారు
శ్రీరాములు గారు అట్టివారే
దేనికైనా మంకుపట్టు పట్టేవారే
ఉడుం పట్టు పట్టేవారే
అనుకున్నది సాధించేవరకు
ఆహారాన్ని ముట్టుకోరట
ఒకనాడు
మదరాసులో దళితుల
దేవాలయ ప్రవేశం కోసం
చేపట్టిన నిరాహార దీక్షను
గాంధీజీ విరమింపజేసి
ప్రాణ బిక్ష పెట్టారట
ప్రత్యేకాంధ్ర సాధన సమయాన
మహాత్ముడే జీవించి ఉంటే మన
శ్రీరాములు మరణించే వారుకాదు
ఒక దశలో కడుపున పుట్టిన బిడ్డను
కట్టుకున్న భార్యను పోగొట్టుకున్న దురదృష్టవంతుడు
ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం
తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం
58 రోజుల ఆమరణ న
