మహానటుడు
డాక్టర్ అక్కినేని
వ్యక్తిత్వం...విభిన్నం
వారి మనస్తత్వం...విచిత్రం
"స్వయంకృషికి"..."క్రమశిక్షణకు"
"ప్రతిభకు ప్రతిరూపం"...డా.అక్కినేని..!
మహానటుడు
డాక్టర్ అక్కినేని అంటే...
ఒక దేవదాసు...
ఒక కాళిదాసు...
ఒక బాలరాజు...
ఒక బాటసారి...
ఒక భక్త తుకారాం...
ఒక బుద్దిమంతుడు...
ఒక దసరా బుల్లోడే కాదు
ఒక అందాల రాముడు కూడా
ప్రేమ మందిరం ప్రేమనగర్
ప్రేమాభిషేకం చిత్రాలలో
నవరసాలు పండించి
తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని
కొల్లగొట్టిన "నటశిఖరం"
"నటసామ్రాట్"... డా. అక్కినేని..!
అక్కినేని...
ఒక నాస్తికుడైతేనేమి..?
అనేక భక్తి రస చిత్రాల్లో
అపూర్వమైన...
అద్వితీయమైన...
అనితరసాధ్యమైన...
అధ్భుత నటనను ప్రదర్శించిన
నాస్తిక "నటదిగ్గజం" డా.అక్కినేని..!
రాజసం ఉట్టిపడే
వీరోచిత పోరాటాలే
ఇతివృత్తాలుగా ఉన్న
జానపద పౌరాణిక చిత్రాల్లో
బక్క పలుచని రూపానికి
హీరో అవకాశాలు దక్కనినాడు
నిర్మాతలకు కాసులవర్షం కురిపించే సాంఘిక చిత్రాలలో హీరోగా
తన విశ్వరూపాన్ని ఆవిష్కరించి
మహిళాప్రేక్షక హృదయాల్ని
దోచుకున్న..."మన్మధుడు"
"మాంత్రికుడు"...డాక్టర్ అక్కినేని..!
సమకాలికుడు సహనటుడైన
ఎన్టిఆర్ లా రాజకీయాలలో
రాణించకున్ననేమి..?
ఆపదలో ఉన్న ఆంధ్రులకు
అనేక గుప్తదానాలు చేసిన
"దయార్ద్ర హృదయుడు"
"దానకర్ణుడు"...డాక్టర్ అక్కినేని..!
అక్కినేని...
కడు పేదరికంలో
పచ్చిపల్లెటూరిలో పుట్టిననేమి..?
నటనా రంగంలో ప్రవేశించి
తెలుగు చలన చిత్రసీమలో
మకుటంలేని మహారాజుగా
వెండితెరపై వెలుగులు విరజిమ్మిన
"అగ్రశ్రేణి నటుడు"అన్నపూర్ణ
"స్టూడియో అధినేత" డా.అక్కినేని...
అక్కినేని...
పెద్ద చదువులు
చదవకున్ననేమి..?
"అ...ఆ...లు అంటే
"అక్కినేని ఆలోచనలు" అంటూ
ఒక చక్కనిగ్రంథాన్ని రచించి మనకు
ఎన్నో జీవిత పాఠాలను బోధించిన...
"పద్మ విభూషణ్"
"దాదాపు సాహెబ్ ఫాల్కే"
"అవార్డులను అందుకున్న
"నడిచే ఓ గ్రంథాలయం"...డాక్టర్ అక్కినేని
