కాళోజీ అంటే
ఒక ధైర్యశాలి
ఒక త్యాగశీలి
ఒక తిరుగుబాటు
ఒక ధిక్కార స్వరం
కాళోజి అంటే ప్రతిధ్వని
ఎందరికో స్ఫూర్తి ప్రదాత
నిర్భీతితో నిక్కచ్చిగా
అక్షర ఆయుధాలను
సంధించి ప్రజల ఆవేదనను
ఆగ్రహాన్ని కళ్ళకు కట్టిన నిప్పురవ్వ
హక్కులను హరించే నక్కజిత్తుల
నిజాం నిరంకుశత్వాన్ని అరాచక పాలనను రజాకార్ల దౌర్జన్యాలను
తన కలం కత్తితో ఎదిరించి
వారి గుండెల్లో నిదురించిన
విప్లవ శంఖం పూరించిన వీరుడు
సాహితీ సమర యోధుడు కాళోజీ
"బానిస భావన పోవాలె,
పలుకుబడుల భాష కావాలె"
అన్నది కాళోజీ నినాదం.
"నా గొడవ" ఖండకావ్యాన్ని లిఖించి
ప్రచండభానుడై ప్రకాశించిన ప్రతిభావంతుడు అక్షర తపస్వి
బహుభాషాకోవిదుడు కాళోజీ
కరిగిపోయే గుండె
మండిపోయే ఒళ్ళు
కలిగిన ఓ ప్రజాకవి
ఒక గొప్ప మానవతావాది
పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత
కాళోజీకి జన్మదిన శుభాకాంక్షలు...
జై తెలంగాణ...జై తెలుగు తల్లి...



