కన్నడ ఆడపడుచుకు
మహారాష్ట్రీయునికి
జన్మించిన మన తెలంగాణ
తెలుగు బిడ్డ మన కాలోజీ
కాలోజీ అంటే..?
"ఒక నిలదీత "ఒక ఎదురీత"
కాలోజీ అంటే..?
"ఒక ఉద్యమం"ఒక ఉప్పెన"
కాలోజీ అంటే..?
"ఒక తిరుగుబాటు" ఒక ధిక్కారస్వరం"
విద్యార్థి నాయకుడిగా అనేక సంఘాలకు సారథ్యం వహించి, విద్యార్థులను
చైతన్య పరచి జైలు జీవితం గడిపిన,
వరంగల్ కోట మీద జాతీయ జెండాను
ఎగురవేసిన "యువకిశోరం" మన కాళోజీ
హక్కులను హరించే నక్కజిత్తుల
నిజాం మక్కెలు విరిచిన
చుక్కలు చూపించిన ప్రక్కలో బల్లెమైన
మరో మన్యం వీరుడు "విప్లవసింహం
అభినవ అల్లూరి" మన కాళోజీ
రజాకార్ల దుర్మార్గాలను ఎదిరించి
వారి గుండెల్లో నిదురించిన "ధైర్యశాలి
"త్యాగశీలి...స్నేహశీలి "మన కాళోజీ
పేదప్రజల ఆకలికేకలను ఆర్తిని ఆగ్రహాన్ని
కన్నీటి బాధలను కలం పట్టి కళ్లకు కట్టి
సాహిత్య సమరం సాగించిన సాటిలేని మేటి "ప్రజాకవి" "పేదప్రజల ప్రతినిధి"
"ప్రతిధ్వని" అభినవ వేమన" మన కాళోజీ
"దేశ భాషలందు తెలుగు లెస్స"
నా తెలంగాణ భాష యాస "నాకు శ్వాస"
అంటూ భాషోద్యమానికి ఊపిరి పోసి
"నా గొడవ" ఖండకావ్యాన్ని వ్రాసిన "గొప్పభాషాభిమాని" అక్షర తపస్వి
రాజకీయ వ్వంగ్యాస్రాలిసరడంలో
"దిట్ట" కవితల పుట్ట"...మన కాళోజీ
"ఒక్క సిరాచుక్క
లక్ష మెదళ్లకు కదలిక"
"బానిస భాషలు పోవాలే"
"పలుకుబడుల భాష రావాలే"
"అన్యాయాన్ని ఎదిరించే
"వారే నాకు ఆరాధ్యులు" అని
ఒక చక్కని సందేశాన్ని
సమాజానికి అందించిన "జ్ఞానముని"
"పద్మ విభూషణుడు" మన కాళోజీ
అట్టి మహనీయునికిదే నా
అక్షర కుసుమాంజలి...
అట్టి సాహితీ సమరయోధునికన్న నా
తల్లి తెలుగు భారతికిదే నా అక్షర హారతి



