Facebook Twitter
తత్వవేత్త డా. కత్తి పద్మారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు..

కారంచేడు చుండూరు
గ్రామాలలో అహంకారులైన
అగ్రవర్ణ భూస్వాముల
ఘోరమైన...
దారుణమైన...
అతి నీచమైన...
అమానవీయమైన...
అమాయకపు జింకలపై
పులులు విరుచుకుపడినట్లు...
నిస్సహాయులు నిరాయుధీయులైన
మాల మాదిగల వాడలపై చేసిన
పరమక్రూరమైన...
రక్తాక్షరాలతో లిఖించబడే...

మానవ చరిత్రలో
మానవత్వానికే
మాయని మచ్చగా మిగిలే...
క్రూరత్వానికే ప్రతీకగా నిలిచే... జులియన్వాలాబాగ్ ఊతకోచలను
తలపించేలా...దళితవాడలపై
దారుణమైన దాడులు చేసిన... అకృత్యాలకు అరాచకాలకు పాల్పడిన...
ఆంధ్రరాష్ట్రంలో రక్తపాతాలు సృష్టించిన...
కులఅహంకారులతో మతోన్మాదులతో
ప్రాణాలకు తెగించి పోరాడిన...
మాట తప్పని...మడిమ తిప్పని...
పోరాటయోధుడు...
విప్లవ వీరుడు ఉద్యమకారుడు...
మండే మధ్యాహ్నపు మార్తాండుడు
బాహుబలి...పొన్నూరు పులి...
ధీశాలి...త్యాగశీలి...సమర సింహం...
కారంచేడు ఖడ్గం... కత్తి పద్మారావు గారు

విశ్వమంతా విస్తూపోయేలా... ప్రపంచమంతా  ప్రతిధ్వనించేలా...
దిక్కులు పీక్కటిల్లేలా తన గళాన్ని...
ఉప్పొంగే గంగా ప్రవాహంలా... 
రగిలే అగ్నిజ్వాలలా...
తన ప్రసంగాన్ని...
పదునైన కరవాలంలా  
తన కలాన్ని...ఝులిపించారు
రుధిర, రక్త క్షేత్రాలను నిర్మించారు
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తెచ్చారు
కులాంతర వివాహాలను ప్రోత్సహించారు
కులనిర్మూలనకై దళితుల హక్కులపై
88 బృహత్ గ్రంథాలను లిఖించిన
జ్ఞాన సూర్యుడు...బాషా పండితుడు
మహాకవి...మహామేధావి...యుగకర్త సంఘసంస్కర్త...హేతువాది...తత్వవేత్త
కారంచేడు ఖడ్గం...కత్తి పద్మారావు గారు

కళ్ళల్లో కారం చల్లినా...
అగ్నిపర్వతాలు బ్రద్దలైనా...
పిడుగులెన్ని నెత్తిన పడినా...
గుండెల్లో గునపాలు గ్రుచ్చినా...
గొంతు మీద గండ్రగొడ్డలి పెట్టినా...
ప్రక్కలో బల్లేలు గుచ్చుకుంటున్నా...
మెడపై పదునైన కత్తి వ్రేలాడుతున్నా...
జైల్లో కుక్కినా ఎంతగా అణగద్రొక్కినా...

భయమన్నది లేక 
దెబ్బతిన్న బొబ్బులిలా ఏటికి ఎదురీదిన
బండలనే పిండిచేసిన కొండలనే ఢీకొట్టిన
భూస్వాముల గుండెల్లో నిదురించిన... అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని అడ్డుకున్న...
బ్రాహ్మణ వాదాన్ని వ్యతిరేకించిన...
గుర్రం జాషువా అభిమాని...
విప్లవవీరుడు...ఉద్యమకారుడు...
సమరయోధుడు...సాహితిశిఖరం...
బుద్ధుడు పూలే పెరియార్ ల వారసుడు
కారంచేడు ఖడ్గం...కత్తి పద్మారావు గారు

ఊరూరా తిరిగి
ఉద్యమాలు నడిపి
ఉరుములు ఉరిమినట్లు...
మెరుపులు మెరిసినట్లు...
జడివానలు కురిసినట్లు...

అహంకారులైన అగ్రవర్ణ
భూస్వాముల గుండెల్లో
రైళ్లు పరిగెత్తించేట్లుగా...
పిడుగులు పడినట్లుగా...
భూకంపం వచ్చినట్లుగా...
సభా వేదికలు దద్దరిలేలా...
తన ఉపన్యాసాలతో
బడుగు బలహీన బహుజన
మైనారిటీ వర్గాల ప్రజలను
చైతన్య పరిచే ఉత్తేజ పరిచే
ఉర్రూతలూగించేలా...
ప్రభంజనమై కదిలేలా...

అవినీతిపరులకు
అక్రమార్కులకు...
అరాచక శక్తులకు
కనువిప్పు కలిగించేలా...
వెన్నులో వణుకు పుట్టించేలా...
సింహ గర్జనలు చేసి‌న...
కారు చీకట్లు కమ్మిన
బడుగుల బ్రతుకుల్లో
వెన్నెల వెలుగుల్ని నింపిన...
వారికి కొండంత అండగా
రక్షణ కవచమై నిలిచిన...
మాట తప్పని మడిమ తిప్పని
విప్లవవీరుడు...ఉద్యమకారుడు
అణగారిన వర్గాల ఆశాకిరణం...
సమతావాది...అభినవ అంబేద్కర్
కారంచేడు ఖడ్గం...కత్తి పద్మారావుగారికి
71 జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందించే "అక్షర కుసుమాంజలి"...