Facebook Twitter
కారంచేడు ఖడ్గం...కత్తి పద్మారావు

1953 జూలై 27 వ తేదిన...
గుంటూరు జిల్లా బాపట్ల మండలం ఈతేరు గ్రామంలో మాణిక్యమ్మ సుబ్బయ్యలను పుణ్యదంపతుల
గర్భాన ఉదయించిన బాల భాస్కరుడు మహాకవి...మేధావి...కత్తి పద్మారావు...

ఆనాడు మనుస్మృతిని దహనం చేసి
మహద్ చెరువులో దోసెడు నీళ్ళకోసం
పోరాడిన భారతరత్న రాజ్యాంగ నిర్మాత అమరజీవి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్
"ఆశయాలే ఆయుధాలుగా"...

జీజస్ క్రైస్ట్ బోధనలు...
కారల్ మార్క్స్ సిద్ధాంతాలు...
జీవితకాలమంతా జైల్లో ఉండి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలా మార్టిన్ లూథర్ కింగ్ ల
"పోరాటాలు...ఆరాటాలే స్పూర్తిగా"...

ఆది హిందూ ఉద్యమ సారథులైన భాగ్యరెడ్డి వర్మ...కుసుమ ధర్మన్నలు
గుర్రం జాషువలే "మార్గదర్శకులుగా"....

అల్లూరి భగత్ సింగ్ బుద్దుడు జ్యోతి రావు ఫూలే పెరియార్ లే "ఆదర్శంగా"...

1985లో "కారంచేడు ఊచకోతకు"... నిరసనగా దుర్మార్గపు హత్యాకాండకు చలించి కాలేజీ లెక్చరర్ ఉద్యోగాన్ని
కాలదన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో
"దళిత మహా సభను" స్థాపించి...
"చుండూరులో జరిగిన మారణకాండకు"
బలై అమరులైన దళితుల శవాలను ఊరి నడిబొడ్డున"రక్తక్షేత్రంలో "ఖననం చేయించి

ఢిల్లీ పురవీధులు దద్దరిల్లేలా...
"విశ్వమంతా" విస్తుపోయేలా...
"ప్రపంచమంతా" ప్రతిధ్వనించేలా...
"దళిత హక్కులకోసం ధర్నాలతో "...రాష్ట్ర రోకోలతో నిరసన సభలతో...హోరెత్తించి

ఆనాటి అగ్రవర్ణ అహంకారులైన భూస్వామ్య పెత్తందారీ వర్గాలతో ప్రాణాలకు తెగించి పోరాడి ప్రభుత్వ పాలకుల ప్రలోభాలకు లొంగక...
"దళిత ఉద్యమానికి రథసారథియై"...

వర్ణాశ్రమ ధర్మాన్ని...
అంటరానితనాన్ని...
తూర్పారపడుతూ తరతరాలుగా
ఊరికి దూరంగా బ్రతుకుతున్న...
దళితజాతి అభ్యున్నతికి సంక్షేమానికి శ్రేయస్సుకు పోయిన హక్కులకోసం పోరాడిన...మహాకవి...మేధావి...
"విప్లవ వీరుడు"డా. కత్తి పద్మారావు...

తరతరాలుగా అంటరానితనానికి బలైపోతున్న అమాయకుల కోసం... కులనిర్మూలన కోసం...సిగ్గులేని ఈ సమాజాన్ని నిగ్గదీస్తూ...అణగారిన
వర్గాల ఆత్మగౌరవం కోసం...సంఘంలో సమానత్వం...సౌభ్రాతృత్వం...స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకోసం...నిరంతరం... ఆరాటపడిన...మహాకవి...మేధావి...
"అభినవ అంబేద్కర్" డా.కత్తి పద్మారావు

అంబేద్కర్ పై...బుద్ధుని పై...
దళిత జాతి‌ పై...కులనిర్మూలనపై...
బ్రహ్మణ‌ ఆధిపత్యం పై పరిశోధనలెన్నో
చేసి బృహత్ గ్రంథాలెన్నోపఠించి లోతైన అధ్యయనం చేసి...మరుగుపడిన ఎన్నో సత్యాల్ని వెలికితీసి వెలుగులోనికి తెచ్చి
88 గ్రంధాలను రచించి...ముద్రించిన... మహాకవి...సంస్కృత పండితుడు...
"జ్ఞాన సూర్యుడు" డా.కత్తి పద్మారావు

తానే ఒక యుద్ధనౌకగా...
దళిత ఉద్యమాన్ని నడిపించి
ఈ భారతదేశంలో ఎస్సీ ఎస్టీ
అట్రాసిటీ యాక్ట్ కు ఊపిరిలూదిన...
కులాంతర వివాహాలను ప్రోత్సహించిన...
ఓ హేతువాది...
ఓ ధిక్కార స్వరం...
ఓ సంఘ సంస్కర్త....
ఓ ఉపన్యాస కేసరి...
ఓ ఉపాధ్యాయుడు...
ఓ ఉద్యమ కారుడు...
ఓ సమర యోధుడు...
ఓ సామాజిక కార్యకర్త...
ఓ కరుణామయుడు...
ఓ బహుజన భానుడు...
ఓ దళితజాతి ఆశాజ్యోతి...
ఓ త్యాగశీలి ఓ బాహుబలి...
ఓ కారంచేడు ఖడ్గం" డా.కత్తి పద్మారావు

ఈ కవి కత్తి చేతిలోని కలం
నాటి టిప్పుసుల్తాన్ చేతిలో ఖడ్గం
ఈ కత్తి ఆఖరి ఆశయం...
బహుజనులకు
రాజ్యాధికారం దక్కాలని...
ఈ నేలపై మంచితనం
మానవత్వం పరిమళించాలని...
సమానత్వం...సౌభ్రాతృత్వం...
స్వేచ్ఛ...స్వాతంత్ర్యాలు...
సజీవనదులై ప్రవహించాలని...
తక్షణమే...కులమత...రహిత...
నవసమాజ నిర్మాణం జరగాలని...