3 రోజులు...
3000 రుచులతో...
5000 కోట్ల ఖర్చుతో...
ప్రముఖ పారిశ్రామికవేత్త
రిలయన్స్ సామ్రాజ్య చక్రవర్తి
అపరకుబేరుడు ముఖేష్ అంబానీ
ముద్దుల తనయుడు...
అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ల
పెళ్లి జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో
ధృక్ గణితం ఆధారంగా...ఆషాఢ మాసంలో సూర్యమాన పంచాంగం ప్రకారం ఆకాశమంత పందిరి
భూదేవి అంత పీటగా విశాలమైన కమనీయమైన కళ్యాణ వేదికను ఏర్పాటు చేశారు...
దీవించ దివినుండి దేవతలు
దిగి వచ్చారో లేదో తెలియదు...కానీ
దేశ నలుమూలల నుండి తరలి వచ్చిన సినీ సెలబ్రిటీల...తళతళమని మేరిసే
తారామణుల...రాజకీయ ప్రముఖుల...
క్రీడాకారుల దేశ విదేశాధినేతల అతిరథ మహారధుల...ఆథ్యాత్మిక గురువుల...
సమక్షంలో...
ప్రపంచంలో ఏ కుభేరుల ఇంట ఇంత
వరకు జరగని విధంగా అట్టహాసంగా... అంగరంగ వైభవంగా...న భూతో న భవిష్యతే
అన్నరీతిలో జరిగిన అంబానీ వారి వివాహ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా
అన్ని టీవీ చానెల్స్ లో తిలకించి పులకించి పోయారు కోట్లాదిమంది...
అతిథులను ఎవరిని చూసినా
పోటీపడి ఒంటినిండా వేసుకున్న
బంగారు భరణాల ధగధగలే...
ఖరీదైన బట్టల తళతళలే మిళమిళలే..
అవి చూసేందుకు "రెండు కళ్ళు" చాలవట...రెండు వేలు కావాలట...



