ప్రమాణస్వీకారం రోజే
మొట్టమొదటి సంతకం
"ఉచిత కరెంటు" పై పెట్టి
రైతులకు"రుణమాఫీ" చేసిన
ఓ రైతు భాంధవా..! ఓ రాజశేఖరా..!
మనసున్న ఓ మహారాజా..! మీకు జోహార్లు
లక్ష కోట్లతో 86 ప్రాజెక్టులతో
సాగు త్రాగు నీరందించే "జలయజ్ఞానికి"
శ్రీకారం చుట్టిన ఓ అపర భగీరధుడా..!
ఓ రైతుబిడ్డ రాజన్నా..! మీకు జోహార్లు
2003 లో 11 జిల్లాల్లో 1475
కిలోమీటర్లు "పాదయాత్ర" చేసి
2009 ఎన్నికల్లో పార్టీ
ఘన విజయానికి
"డబుల్ ఇంజన్ సర్కార్"
ఏర్పాటుకు మూలస్థంభమైన
పట్టువదలని ఓ విక్రమార్కుడా..!
మనసున్న ఓ మహరాజా..!
అన్నా ఓ రాజన్నా..! మీకు జోహార్లు
తెలుగు ప్రజల గుండెల్లో
కొలువైవున్న ఓ దైవమా..!
తెలుగు జాతి వెలుగు కిరణమా..!
"మాట తప్పని మడిమ తిప్పని"
మనసున్న ఓ మహరాజా..!
అన్నా ఓ రాజన్నా..! మీకు జోహార్లు
ప్రేమ అనురాగం ఆప్యాయత
నిండిన చల్లని చూపులతో
ఆప్యాయంగా పలకరించే...
ఓ ప్రేమామయుడా..!
ఆపదలో ఉంటే ఆదుకోమంటే
నేనున్నానంటూ భుజంతట్టి
భరోసా నిచ్చే ఓ ఆపద్భాంధవా
ఘనుడా..! ఓ త్యాగధనుడా...!
చెరగని చిరునవ్వులతో
కరుణను కురిపించే చూపులతో
స్వచ్చమైన ప్రేమనిండిన మనసుతో
దయా జాలి క్షమా సుగుణాలతో
ఆ కరుణామయునికి ప్రతిరూపమా..!
మనసున్న ఓ మహరాజా..!
అన్నా ఓ రాజన్నా..!..మీకు జోహార్లు
ఎన్నో ఆటుపోట్లను
ఎన్నో వెన్నుపోట్లను
ఎన్నో ఎదురుదెబ్బల్ని
తట్టుకొని పార్టీలో నిలబడి
ఎన్నో సాహసోపేతమైన
రాజకీయ పోరాటాలు చేసి
ఎందరో దిగ్గజాలను ఢీకొట్టి
ఎన్నో ఏళ్ళ నిరీక్షణ తర్వాత
"ముఖ్యమంత్రి" కలను
సాకారం చేసుకున్న
ఓ బహుముఖ ప్రజ్ఞాశాలీ..!
ఓ రాజకీయ దురంధరా..!
ఓ జన హృదయ నేతా..!
మనసున్న ఓ మహరాజా..!
అన్నా ఓ రాజన్నా..! మీకు జోహార్లు
నిరుపేదలకు నిరాశ్రయులకు
"రాజీవ్ స్వగృహ" పేర లక్షలాది
"ఇందిరమ్మ ఇల్లు" నిర్మించి ఇచ్చిన
ఓ రాజశేఖరా..!
ఓ పేదలపక్షపాతీ..!
ఓ పేదలపాలిటి పెన్నిధీ..! మీకు జోహార్లు
లక్షలాది పీడిత తాడిత పేద
విద్యార్థుల ఉన్నత చదువులకోసం
"ఫీ రీయింబర్స్మెంట్" పథకం
ప్రవేశపెట్టిన విద్యవిలువ నెరిగిన
ఓ జ్ఞాననేత్రా..!
ఓ సరస్వతీపుత్రా..!
ఓ మనసున్న మహరాజా..!
ఓ వైయస్ రాజశేఖరా..! మీకు జోహార్లు
"ఆరోగ్య శ్రీ" తో కష్టజీవులు
అణగారిన బడుగు బలహీన
బహుజన మైనారిటీ వర్గాల
పిల్లలకు కార్పోరేట్ హాస్పిటల్లో
ఖరీదైన "గుండె ఆపరేషన్లు" ఫ్రీగా చేయించిన...ఎందరో చిన్నారులకు
పునర్జన్మను ప్రసాదించిన...
రయ్ రయ్ మంటూ
"108 వాహనాలు"...
ఇంటింటికి పంపించిన...
అత్యవసర వైద్యం అందించిన...
ఓ ప్రాణదాతా..!
ఓ ఆరోగ్య ప్రదాతా..!
ఓ మనసున్న మహరాజా..!
ఓ వైయస్ రాజశేఖరా..! మీకు జోహార్లు



