Facebook Twitter
భయపడకండి, ధైర్యంగా వుండండి..

గుండెల్లో గుబులురేపే 

కరోనాను గుర్తు చేసుకోకండి

కరోనా కరోనా అంటూ

కలవరించకండి

భయపడకండి మిత్రులారా 

భయపడకండి ధైర్యంగా వుండండి

 

గజ్జికుక్కలా గుంటనక్కలా

నక్కినక్కితిరిగే కరోనా 

చేతికి చిక్కితే

బడితపూజ చేద్దాం

కొండపోచమ్మకు బలిద్ధాం

భయపడకండి మిత్రులారా 

భయపడకండి ధైర్యంగా వుండండి

 

దాగుడుమూతలు ఆడే

కరోనాను దహనం చేద్దాం

కాల్చి బూడిద చేద్దాం

భయపడకండి మిత్రులారా 

భయపడకండి ధైర్యంగా వుండండి

 

కారుమేఘంలా 

మంచుముక్కలా 

కరోనా కరిగిపోతుంది

కారుచీకటిలా 

కరోనా తొలిగిపోతుంది

వెలుగురేఖలు విచ్చుకుంటాయి

వేయి ఇంద్రధనుస్సులు 

కోటి ఉషోదయాలు ఉదయిస్తాయి

భయపడకండి మిత్రులారా 

భయపడకండి ధైర్యంగా వుండండి

 

ఉందిలే మంచి కాలం ముందుముందునా

అందరూ సుఖపడాలి నందనందనా...అహఉందిలే