Facebook Twitter
తీరం దాటిన తుఫానే...

ఇమ్యూనిటీ కొరబడితే

కమ్యూనిటీ ట్రాన్మిషన్ జరిగితే

కరోనా కట్టలుతెగిన ప్రవాహమే

తీరం దాటిన తుఫానే

తోక త్రొక్కిన త్రాచే

కళ్ళెం లేని గుర్రమే

 

ప్రజలు కళ్ళముందే 

పిట్టల్లాగ రాలిపోతారు

లక్షలమందిని కరోనా

పొట్టన పెట్టుకుంటుంది

 

ఇదే అతి ప్రమాదకరమైనదే 

మూడవ దశంటే

ఇదే కరోనా మరణమృదంగం

వినిపించే విషాద దశంటే

 

ఆ దశే వస్తే,మనం

బ్రద్దలయ్యే అగ్నిపర్వతం 

అంచున వున్నట్లే

మనకు అనంత ప్రళయం 

దాపురించినట్లే

 

ఆ దశే వస్తే, మనం

హోరుగాలిలో జోరువానలో 

నడిసంద్రంలో వున్నట్లే

విద్వంసాన్ని సృష్టించే సునామీ 

మనమీద విరుచుకు పడినట్లే

 

ఆ దశే వస్తే, మనం

బుసలు కొట్టే విషసర్పం 

పడగనీడలో నిదురిస్తున్నట్లే

మన ముందు మృత్యువు 

కరాళ నృత్యం చేస్తున్నట్లే

 

అట్టి క్లిష్టపరిస్థితుల్లో తమ 

ప్రాణాలను ఫణంగా పెట్టి

నిరంతరం నిస్వార్థంగా సేవలుచేసే 

ప్రాణదాతల చేతులు కట్టేసినట్లే

 

కారణం, 

నియంత్రణంటూ లేనివారికి

నిర్లక్ష్యం వహించినవారికి

నిండూ నూరేళ్ళు నిండినట్లే

ఔను మూడవదశంటే

దారుణ

మారణకాండకు ఆరంభమే

ప్రపంచమంతా

ప్రళయమే విషవలయమే

వికృతి కరోనా విలయతాండవమే

జాగ్రత్త.తస్మాత్ జాగ్రత్త.మిత్రులారా