కొలకలూరి ఇనాక్ లో
ఒక శాంతమూర్తి...
ఒక సౌజన్యమూర్తి...
ఒక ప్రేమా మయుడు...
ఒక దయా సముద్రుడు...
ఒక దళిత జాతి జ్యోతి....
ఒక బహుజన భానుడు...
ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి...
ఒక కరుణామయుడు కనిపిస్తారు
ఆ మంచితనం...
ఆ హుందాతనం...
ప్రతిసభలో వారందించే
సంక్షిప్త సుందర శుభసందేశం...
అద్వితీయం అద్భుతం అపురూపం
చెరగని చిరునవ్వులతో...
శాలువాలు కప్పి జ్ఞాపికలిచ్చి...
ఎందరో కవులను వేదికలపై
ఘనంగా సన్మానించి సత్కరించి...
తమ అమృతహస్తాలతో...దీవించి...
భుజం తట్టి...ప్రోత్సాహించే...
ప్రేమించే వారి హృదయం నవనీతం...
ఎందరో కవులు వారికి ఋణపడి
ఉన్నారు వారిలో నేనూ ఒకడిని...
మనందరి ఆయుష్షు పోసుకొని...
మన గురుతుల్యులు...
సాహితీ శిఖరం...
సాహితీ సింహం...
సాహితీ సరోవరం...
పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారు
నిండూ నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని...
ప్రశాంతమైన శేషజీవితాన్ని
ఆ పరమాత్మ వారికి ప్రసాదించాలని... మనసారా కోరుకుంటూ...
వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ...
ఈ సాహితీమూర్తి జన్మించినందుకు
మన తెలుగునేల...
మన తెలుగు తల్లి...
మన తెలుగు జాతి...యావత్తు
పులకించే ఈ శుభవేళ...
కవిరత్న...సహస్ర కవిభూషణ్...
పోలయ్య కవి కూకట్లపల్లి
గురుదక్షిణగా అందిస్తున్న...
సుందర సుమధుర సుగంధభరిత అక్షరాభినందన చందన మందార మాల...



