సాహితీ శిఖరం.. పద్మశ్రీ కొలకలూరి ఇనాక్..!(2)
సభావేదికపై
వెలిగే తెలుగు తేజం...
మృదుస్వభావి...
నిగర్వి...నిర్మలమూర్తి
సాహితీ చక్రవర్తి...పద్మశ్రీ ఇనాక్ గారు
మంచుముక్కలాంటి...
గందపు చెక్కలాంటి...
మంచి మనసుకున్న
సహృదయులు...సాహితీ శిఖరం...
స్పూర్తి ప్రదాత...పద్మశ్రీ ఇనాక్ గారు...
దివ్యమైన ఒక వెలుగు వుంటుంది
వారి ముఖంలో ...
పరిమళిస్తుంది...
మంచితనం...మానవత్వం
వారి మాటల్లో...
ప్రతి ధ్వనిస్తుంది...
సేవాతత్వం..వారి చేతల్లో...
ప్రవహిస్తుంది...
ప్రేమతత్వం...
వారి చల్లని చూపుల్లో
పొంగిపొర్లుతుంది
కవులంటే ఎనలేని అనురాగం... ఆప్యాయత... వారి గుండెల్లో...
సహనం...శాంతం వారి సొంతం...
ఓర్పు వారిలో అనంతం...
సమయపాలనకు...
వారు చక్కని చిరునామా...
మచ్చలేని..స్వచ్చమైన
వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం
మన గురుదేవులు
పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారు...



