నారా చంద్రబాబు నాయుడు...
అనే నేను...
శాసనం ద్వారా
నిర్మితమైన
భారత రాజ్యాంగం పట్ల...
నిజమైన విశ్వాసం
విధేయత చూపుతానని...
భారతదేశ సార్వభౌమాధికారాన్ని... సమగ్రతను కాపాడుతానని...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా
నా కర్తవ్యాలను శ్రద్ధతో...
అంతఃకరణ శుద్ధితో...
నిర్వహిస్తానని...
భయం కానీ...
పక్షపాతం కానీ...
రాగద్వేషాలు కానీ...లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి... ప్రజలందరికీ న్యాయం చేకూర్చుతానని... దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను...
అంటూ...స్వర్ణాంధ్ర ప్రదేశ్ సృష్టికర్త
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
విచ్చేసిన అతిరథ మహారధుల సమక్షంలో
ప్రమాణ స్వీకారం చేసి నాలుగోసారి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా
అధికారపీఠాన్ని అధిరోహించిన శుభవేళ
అంగరంగ వైభవంగా జరిగిన
ప్రమాణస్వీకార మహోత్సవానికి ...
వేదికనలంకరించిన ఆహ్వానితుల్లో
ప్రత్యేక ఆకర్షణ...హ్యాట్రిక్ కొట్టిన
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారే...
నదులన్నీ సముద్రంలో
కలుస్తాయన్నది నానుడి...కానీ
సముద్రమే నదుల్లో కలిసిన రీతిగా...
ఒక జాతీయ పార్టీనేత...
సాక్షాత్తూ ఒక దేశ ప్రధాని
ఒక ప్రాంతీయ పార్టీనేత...
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి
ప్రమాణస్వీకారానికి అతిథిగా రావడం ఆంధ్రరాష్ట్రానికి దక్కిన అరుదైన గౌరవం
ఇక ప్రధాని మోడీ ప్రేమతో రాష్ట్రానికి
ప్రసాదించాలి ప్రత్యేకహోదా వరం...
ఇది అపర చాణక్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారితోనే సాధ్యం...



