ఒక సామాన్య రైతుబిడ్డ...
ప్రతిష్టాత్మకమైన
రామోజీ గ్రూపు
సంస్థల అధినేత...
ప్రముఖ పారిశ్రామికవేత్త...
బహుముఖ ప్రజ్ఞాశాలి...రామోజీ
1936, నవంబర్ 16 వ తేదీన...
కృష్ణాజిల్లా పెదపారుపూడిలో
చెరుకూరి వెంకట సుబ్బారావు
సుబ్బమ్మ పుణ్యదంపతులకు జననం
ప్రజలను చైతన్య
వంతులను చేసేందుకు...
విజ్ఞానవంతులుగా మార్చేందుకు...
తెలుగు బాషా పురోభివృద్ధికి...
తెలుగు జాతి వికాసానికి...
వెలిగించిన అక్షర దీపం...
1974, ఆగస్ట్ 10 వతేదీన...
విశాఖ తీరాన ప్రజాపత్రిక రామోజీ
మానసిక పుత్రిక "ఈనాడు" పత్రికస్థాపన
తెలుగు చలనచిత్ర
సీమకు మకుటాయమానంగా
యావత్ చిత్ర జగత్
విస్తుపోయేలా...2 వేల
ఎకరాల్లో ప్రతిష్టాత్మకమైన
"రామోజీ ఫిల్మ్ సిటీని"... నిర్మించి...
తెలుగు జాతికి ఖండాంతర
ఖ్యాతిని ఆర్జించి పెట్టిన...
బాహుబలి బహుముఖ ప్రజ్ఞాశాలి...
పద్మవిభూషణ్...రారాజు రామోజీ
ఎలక్ట్రానిక్ రంగంలో ప్రవేశించి
తెలుగు ఈటీవిని స్థాపించి...
విభిన్న భాషల్లో విస్తరించి...
గాన గంధర్వుడు బాలుగారి
సారధ్యంలో పాడుతా తీయగా
స్వరాభిషేకంలాంటి కార్యక్రమాలతో
వందలాది టీవీ సీరియల్స్ తో
లక్షలాది కుటుంబాలకు...
వినోదాన్ని విజ్ఞానాన్ని పంచి...
కోట్లాదిమంది హృదయాలను
కొల్లగొట్టిన బుల్లితెర చక్రవర్తి...రామోజీ
ఎన్నో సంస్థలు స్థాపించి
వేలాది మందికి
ఉద్యోగ ఉపాధి అవకాశాలను
కల్పించి లక్షలాది కుటుంబాల
ఆకలి బాధను తీర్చిన...అన్నదాత
ఎందరికో ఆత్మబంధువు...
తెలుగుజాతి...ఆరాధ్య దైవం
2024, జూన్ 8 వతేదీన...
అస్తమించిన అక్షరయోధుడు ...
ఆరని అక్షరదీపం...రామోజీరావుకు
అశ్రునయనాలతో...అక్షర నీరాజనం...



