ఆరుకోట్ల
ఆంధ్రుల అందగాడు
అసాధారణ నటనకు...
ఆత్మ గౌరవానికి
ప్రతిరూపం...
క్రమశిక్షణకు...
సమయ పాలనకు...
చెరగని చక్కని చిరునామా...
ఎవరు బ్రదర్...? ఎవరు ఇంకెవరు..?
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ
శ్రీ నందమూరి చందమామే..!
చిత్రసీమ చరిత్రలో
బాక్సాఫీస్ రికార్డులను
బద్దలు కొట్టి మైలురాళ్ళ
వంటి 302 పౌరాణిక
సాంఘిక జానపద
చారిత్రక చిత్రాల్లో తన
అసాధారణ అపూర్వ
అధ్భుత అద్వితీయ నటనతో
కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన
ఆంధ్రుల అభిమాన...కథానాయకుడు
శ్రీ కృష్ణునిగా శ్రీరామునిగా
దుర్యోధనుడిగా దుశ్శాసనుడిగా
పూరాణ పాత్రల్లో జీవించిన
వెండితెరపై వెలిగిన ధృవతార అభినవ...అవతార పురుషుడు
అట్టడుగు బడుగు బలహీన
బహుజన వర్గాల ఆత్మబంధువు
ఎవరు బ్రదర్..? ఎవరు ఇంకెవరు...?
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ
శ్రీ నందమూరి చందమామే..!
సమాజమే దేవాలయం...
ప్రజలే నా దేవుళ్ళను నినాదంతో
పేదలపార్టీ పెట్టి ఆరుకోట్ల
ఆంధ్రుల ఆత్మగౌరవం పేరిట
ఎన్నికల శంఖారావం...పూరించి
9 నెలల కాలంలోనే...
కాంగ్రెస్ కంచుకోటను...బ్రద్దలుకొట్టి
అఖండ మెజారిటీతో
ముఖ్యమంత్రి పీఠాన్ని...
అధిరోహించిన...
అఖండుడు...సింహబలుడు...
పేదప్రజల పక్షపాతి...
సంక్షేమ పథకాల రధసారధి...
ఆంధ్రుల ఆత్మగౌరవానికి
నిలువెత్తు నిదర్శనం...
ఎవరు బ్రదర్..? ఎవరు ఇంకెవరు...?
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ
శ్రీ నందమూరి చందమామే..!
పటేల్ పట్వారీ వ్యవస్థను
రద్దుచేసి... మద్యపాన నిషేధం...
రెండు రూపాయలకే కిలో బియ్యం...
మహిళలకు ఆస్తిలో సమానహక్కు...
వంటి పచ్చని పథకాలతో జనరంజకంగా
రామరాజ్యపాలన...అందించిన...
అభినవ రాముడు...అడవిరాముడు...
మహాఘనుడు...త్యాగధనుడు
ప్రజల గుండెల్లో నిలిచిన తెలుగు
ప్రజల ఆరాధ్యదైవం...అమరజీవి
ఎవరు బ్రదర్..? ఎవరు ఇంకెవరు..?
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ
శ్రీ నందమూరి చందమామే...!
ట్యాంక్ బండ్ మీద
కనుమరుగైపోతున్న కవీశ్వరుల
నిలువెత్తు కాంస్య విగ్రహాలతో
తెలుగుభాష వికాసానికి పట్టంకట్టి
తెలుగుజాతికి ఖండాంతర
ఖ్యాతిని ఆర్జించి పెట్టి
కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా
అఖండ కీర్తిని ఆర్జించిన....
చరిత్ర సృష్టించిన...
మన జనహృదయనేత
ఎవరు బ్రదర్..? ఎవరు ఇంకెవరు..?
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ
శ్రీ నందమూరి చందమామే...!



