ఎక్కడుందో ? ఎక్కడుందో ?
కంటికి కనిపించని ఈ కరోనా రాక్షసి?
అది ఎక్కడో లేదు అది మీ ప్రక్కనే వుంది
మీ అందరి చుట్టే నక్కినక్కి తిరుగుతుంది
అది ఎటు వైపు నుంచైనా
ఎప్పుడైనా ఏ క్షణమైనా రావచ్చు
కాలసర్పమై కాటువేయవచ్చు
ముందు జాగ్రత్తలు తీసుకోని వారందరినీ
మృత్యువులా కబలించివేయవచ్చు
అది అకస్మాత్తుగా
ఒక సునామీలా ,ఒక సుడిగాలిలా
ఒక ప్రవాహంలా ప్రభంజనం లారావచ్చు
భయంకరమైన వినాశనాన్ని
కలలో కూడా ఊహించని
విధ్వంసాన్ని సృష్టించవచ్చు
అందుకే,అది తెలియనందుకే
దాన్ని కట్టడి చేయనందుకే
నిర్లక్ష్యము వహించినందుకే
స్వీయ నియంత్రణ పాటించనందుకే
అమెరికా ఇటలీ ఇరాన్ ప్రాన్స్ స్పెయిన్
దేశాల ప్రజలు భారీ మూల్యాన్ని
చెల్లించుకుంటున్నాయి
అది ఒక అనకొండలా,
ఆకలి గొన్న ఆడసింహంలా
చిక్కితే చీల్చివేసే చిరుతపులిలా వచ్చేసింది
ప్రపంచంమీద పిడుగల్లే విరుచుకుపడింది
ప్రళయాన్ని సృష్టిస్తుంది
విలయతాండవ మాడుతుంది
కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుంది
అన్ని దేశాల్లో మరణమృదంగాన్ని
మ్రోగిస్తుంది ...కాస్త జాగ్రత్త సుమీ.
So, Stay at home and Save India.



